స్టూవర్డ్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథతో సినిమాని తెరకెక్కించేందుకు గత కొంతకాలంగా సన్నాహకాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ స్క్రిప్టుపై తమకే అధికారం ఉంది అంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ తెలిసినదే.
అయితే ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రారంభమైంది. తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో ఏఏ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. వంశీ ఈ చిత్రానికి దర్శకరచయిత. నేటి ప్రారంభోత్సవంలో నిర్మాత విష్ణు ఇందూరి.. పీటర్ హెయిన్స్ .. రామ్ లక్ష్మణ్ మాస్టార్లు.. జీవీ ప్రకాష్ కుమార్.. సంతోషం సురేష్ కొండేటి సహా పలువురు అతిథులు పాల్గొన్నారు. కథానాయికలు సహా చిత్రబృందం పూజాకార్యక్రమాల్లో పాల్గొంది.
పూజా కార్యక్రమా భారీ సెట్లలో ఎంతో వైభవంగా సాగుతోంది. అందుకు సంబంధించిన లైవ్ లో రవితేజ అభిమానులు జయజయధ్వానాలు పలుకుతున్నారు. మాస్ రాజా లో ఎనర్జీని మరో లెవల్లో బయటకు తెచ్చే చిత్రమిదని పొగిడేస్తున్నారు.
రూత్ లెస్ రాజా దుమారమే ఇక అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. మొత్తానికి రవితేజ పని అయిపోయిందన్న ప్రచారం సాగాక అతడి గ్రేట్ కంబ్యాక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అతడు రూ.10కోట్లు పైగా పారితోషికం అందుకునేందుకు అర్హుడు అని ఇటీవలి విజయాలు మరోమారు నిరూపించాయి.