బాక్స‌ర్ 'గ‌ని' స్ర్కీనింగ్ పాత ధ‌ర‌ల‌తోనే!

Update: 2022-04-04 06:30 GMT
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `గ‌ని` వాయిదాల మీద వాయిదాలు ప‌డి ఎట్ట‌కేల‌కుల ఈనెల 8న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య  చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. వ‌రుణ్ ఫాం...`గ‌ని`లో బాక్స‌ర్ గా న‌టించ‌డం స‌హా ప్ర‌చార చిత్రాలు సినిమాపై భారీ అంచ‌నాల్ని క్రియేట్ చేసాయి. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే ద‌ర్శ‌కుడు  కిర‌ణ్ కొర్ర‌పాటి స‌రికొత్త వ‌రుణ్ వెండి తెర‌పై ఆవిష్క‌రిస్తున్నాడ‌ని తేలిపోయింది.

అటుపై రిలీజ్ అయిన టీజ‌ర్..ట్రైల‌ర్ వ‌రుణ్ క్యార‌క్ట‌రైజేష‌న్ ని మ‌రింత హైలైట్ చేసాయి. దాదాపు 35 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ తో నిర్మించారు. వ‌రుణ్ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఇదే బారీ బ‌డ్జెట్ చిత్రం కూడా. ఇదే సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారెఉడు బాబి నిర్మాత‌గా ప‌రిచంయ అవుతున్నాడు. ఇందులో ఆయ‌న కీల‌క పాత్ర‌ధారిగా చెప్పొచ్చు. దీంతో నిర్మాత‌లు ఎంత న‌మ్మ‌కంతో ఇంత బడ్జెట్ కేటాయించారో అంచ‌నా వేయోచ్చు. ఇలా ఎన్నో విశేషాలు `గ‌ని`లో ఉన్నాయి.

ఇక అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఈనెల 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే ఈసినిమా  తెలంగాణ‌లో పాత టిక్కెట్ ధ‌ర‌ల‌తోనే రిలీజ్ అవుతుంది.  మ‌ల్టీప్లెక్స్ లో 200 రూపాయ‌లు..జీఎస్టీ పే చేయాలి. సింగిల్ స్ర్కీన్ థియేట‌ర్ల‌లో 150-జీఎస్టీ పే చేయాలి. దీంతో  ఈ సినిమా విష‌యంలో ఎలాంటి మిన‌హాయింపులు లేవ‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో కేవ‌లం పాత ధ‌ర‌ల‌తోనే రిలీజ్ అవుతుంది. ఇక ఏపీలోప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

స్టార్ హీరోల సినిమాల‌కు..భారీ బ‌డ్జెట్   సినిమాల‌కు టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు రెండు రాష్ర్టాల ప్ర‌భుత్వాలు  క‌ల్పించాయి.  దానికి కొన్ని ప‌రిమితిలు కూడా ఉన్నాయి. మ‌రి ఆ కోటాలోకి వ‌రుణ్ తేజ్ ఇంకా చేరిన‌ట్లు లేదు. అందుకే పాత ధ‌ర‌ల‌తోనే గ‌ని రిలీజ్ అవుతుంది. ఇటీవ‌లే `ఆర్ ఆర్ ఆర్` టిక్కెట్ ధ‌ర‌తో  ప్రేక్ష‌కుడి న‌డ్డి విరిగిపోయింది.

సినిమా వీరాభిమానులంతా  400 రూపాయ‌లు వెచ్చించి `ఆర్ ఆర్ ఆర్` వీక్షించి ఆనంద‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఓసెక్ష‌న్ ఆడియ‌న్స్ `ఆర్ ఆర్ ఆర్` పై మండిప‌డ్డారు.  ఆ కార‌ణంగానూ `గ‌ని` నిర్మాత‌లు రాష్ర్ట ప్ర‌భుత్వాల ముందుకు టిక్కెట్ ధ‌ర పెంచుకుంటామ‌ని వెళ్లి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని మ‌రోవైపు టాక్ వినిపిస్తుంది. కార‌ణాలు ఏవైనా `గ‌ని` తెలంగాణ‌లో పాత ధ‌ర‌ల‌తో ప్రేక్ష‌కుల  ముందుకు రావ‌డం సంతోషక‌ర‌మైన విష‌యంగా అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News