బాల‌కృష్ణ వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రెవ‌రు ఏమంటున్నారు?

Update: 2023-01-24 21:11 GMT
టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన నంద‌మూరి బాల‌కృష్ణ తెలుగు సినీ దిగ్గ‌జాలైన ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ల‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై గ‌త రెండు రోజులుగా పెద్ద దుమారం రేగుతున్న విష‌యం తెలిసిందే. బాల‌య్య `వీర సింహారెడ్డి` విజ‌యోత్స‌వంలో స్టేజ్ పై మాట్లాడుతూ `ఆ రంగారావు..ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని` అంటూ చేసిన వ్యాఖ్య‌లు అక్కినేని ఫ్యామిలీ హీరోల‌కు, వారి అభిమానుల‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించాయి.

దీనిపై ప‌లువురు భిన్నాభిప్రాయాల‌ని వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని అభిమానులు బాల‌య్య‌పై మండిప‌డుతున్నారు. `నంద‌మూరి తార‌క‌రామారావు గారు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దు బిడ్డ‌లు. వారిని అగౌర‌ప‌ర‌చ‌డం మ‌న‌ల్ని మ‌న‌మే కించ‌ప‌రుచుకోవ‌డం` అంటూ నాగ‌చైత‌న్య‌, అఖిల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించడం తెలిసిందే.

ఇదే విష‌యంపై తాజాగా ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోషియేష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వెంట‌నే బాల‌కృష్ణ స్పందించాల‌ని, అక్కినేని ఫ్యామిలీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప‌లు టీవీ షోల్లో ఈ వివాదంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ టీవీ ఛాన‌ల్ వేదిక‌గా అక్కినేని అభిమాని శంక‌ర్ రెడ్డి బాల‌య్య‌పై విరుచుకుప‌డ్డారు. అక్కినేని తొక్కినేని అని ఆయ‌న అన్న‌ట్టు `బాలి.. బోడి..` అంటే మేము అన‌గ‌లం కానీ మాకు అంటూ ఓ సంస్కారం వుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు మాకు ఆ సంస్క‌రాం నేర్పారు అంటూ స్పందించారు.

అంతే కాకుండా ఈ వివాదంపై బాల‌కృష్ణ స్పందించి వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. త‌ను ఏం మాట్లాడారో క్లియ‌ర్ చేసి క్ష‌మాప‌ణ‌లు చెబితే మంచిద‌ని స‌ల‌హా ఇచ్చారు. ఇక ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ లు బాల‌య్య వివాదంపై స్పందించారు. ఓ యూట్యూబ్ ఛాన‌ల్ తో మాట్లాడుతూ వీడియో చూశాన‌ని, అయితే బాల‌కృష్ణ ఓ ఫ్లోలో మాట్లాడిన‌ట్టుగా వుందే త‌ప్పితో ఉద్దేశ పూర్వ‌కంగా మాట్లాడిన‌ట్టుగా లేద‌న్నారు. ప‌క్క‌న వున్న ఆర్టిస్ట్ గురించి చెబుతూ పాత జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకుంటామ‌న్నారే కానీ ఇంటెన్ష‌న‌ల్ గా మాత్రం అక్కినేని తొక్కినేని అని మాత్రం ఆయ‌న అన‌లేద‌న్నారు.

ఇదిలా వుంటే బాల‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌పై కాపు నాడు ఆల్టిమేట‌మ్ జారీ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వ‌ర్గం కాపునాడు తీవ్రంగా ప‌రిగ‌ణించింద‌ని, బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు కాపుల మనోభావాల‌ని దెబ్బ‌తీసేవిలా వున్నాయ‌ని, ఈ వ్యాఖ్య‌ల‌పై ఈ నెల 25 లోపు బాల‌కృష్ణ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని.. అలా బాల‌కృష్ణ  క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ని ప‌క్షంలో కాపులంతా శాంతియుతంగా రంగా విగ్ర‌హాల వ‌ద్ద మౌన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని కాపునాడు పిలుపు నిచ్చిన‌ట్టుగా చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News