ద‌యానాయ‌క్ పై పూరి తీసేశాడుగా శెట్టి గారూ!

Update: 2022-05-04 13:30 GMT
పోలీస్ అధికారుల జీవితాల్లో ఎమోష‌న్ ని ట‌ర్నులు ట్విస్టుల్ని తెర‌పై ఆవిష్క‌రిస్తే అవి బంప‌ర్ హిట్లుగా నిలుస్తాయ‌ని ఇప్ప‌టికే ప్రూవైంది. ఇది  సినిమాటిక్ వ‌ర‌ల్డ్ లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల ఎలివేష‌న్ కి స‌హ‌క‌రిస్తుంది. ఇక పోలీస్ స్టోరీల్ని తెర‌కెక్కించ‌డంలో పూరి జ‌గ‌న్నాథ్ కి కూడా చ‌క్క‌ని గుర్తింపు ఉంది. కాప్ బ‌యోపిక్ కేట‌గిరీలోనూ ఆయ‌న ఓ సినిమా తీసారు. గోపిచంద్ తో 'గోలీమార్' బ‌యోపిక్ కేట‌గిరీనే. ముంబై ప‌వ‌ర్ ఫుల్ కాప్ ద‌యానాయ‌క్ జీవితం ఆధారంగా మాస్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు. గోలీమార్ ఆద్యంతం గ్రిప్పింగ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా అల‌రించింది. ఈ సినిమా గోపిచంద్ ని ప‌వ‌ర్ ఫుల్ కాప్ గా ఆవిష్క‌రించింది.

ఇక బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కూడా ప‌వ‌ర్ ఫుల్ కాప్ చిత్రాలను తీయడంలో దిట్ట అన్న సంగ‌తి తెలిసిందే. సింగం సిరీస్- సింబా- సూర్యవంశీ వంటి పోలీసు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బంప‌ర్ హిట్లు కొట్టాడు శెట్టి. అయితే ఇవ‌న్నీ ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చి బంప‌ర్ హిట్లుగా నిలిచాక రీమేక్ లుగా రూపొందిన‌వి. పైగా ఇవి సౌత్ నుంచి స్ఫూర్తి పొందిన‌వి.

కానీ ఈసారి వీట‌న్నిటికీ భిన్నంగా ఒరిజిన‌ల్ స్టోరీతో అత‌డు కాప్ యూనివ‌ర్శ్ ని క్రియేట్ చేస్తుండడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. రోహిత్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనే వెబ్ సిరీస్ ని ప్రారంభించాడు. ఇంత‌లోనే దీంతో సంబంధం లేకుండా మరో పోలీసు చిత్రాన్ని శెట్టి ప్రకటించాడు.

ఉగ్రవాదుల‌కు సింహ‌స్వ‌ప్నంగా నిలిచి దేశం నుంచి వారిని త‌రిమివేసే ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా పేర గాంచిన‌ మాజీ ఐపీఎస్ అధికారి రాకేష్ మారియా జీవితం ఆధారంగా త్వరలో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా రాకేష్ మారియాతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేయడం ద్వారా రోహిత్ శెట్టి అధికారికంగా ఈ బ‌యోపిక్ ని ప్రకటించారు. 1993లో ముంబై పేలుడు కేసును ఛేదించిన ఘ‌నుడు రాకేష్ మారియా.

90ల చివరలో ముంబై అండర్ వరల్డ్ ను గ‌డ‌గ‌డ‌లాడించిన ఆఫీస‌ర్ అత‌డు. ఆ త‌ర్వాత‌ 26/11 దాడుల సమయంలో బ్రతికి ఉన్న ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ని హ్యాండిల్ చేస్తూ నగరం కోసం బలంగా నిలబడిన అధికారిగానూ రికార్డుల‌కెక్కారు. క‌ర్క‌శ పాక్ తీవ్ర‌వాది క‌స‌బ్ ని ప్ర‌శ్న‌ల తూటాలతో డీల్ చేసిన అధికారిగా అత‌డిని ఆర్జీవీ 26/11 ఎటాక్స్ చిత్రంలో చూపించిన తీరు మెప్పించింది.

రాకేష్ మారియా ధైర్యం పరాక్రమానికి పర్యాయపదం..! ఈ నిజ జీవిత సూపర్ కాప్ ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నాను!!! అని శెట్టి ఈ సంద‌ర్భంగా అన్నారు. రాకేష్ మారియా కెరీర్ అనుభవాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే పూరి చాలా సంవ‌త్స‌రాల క్రిత‌మే ముంబై ప‌వ‌ర్ ఫుల్ కాప్ ద‌యానాయ‌క్ స్టోరీని ఎంతో గ్రిప్పింగ్ గా తెర‌పై ఆవిష్క‌రించ‌గా.. 26/11 ఎటాక్స్ లో రాకేష్ మారియా పాత్ర‌ను ఆర్జీవీ అంతే ప‌వ‌ర్ ఫుల్ గా చూపించారు. బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ కాప్ సినిమాలు వ‌చ్చాయి. వాట‌న్నిటినీ మించి ఇప్పుడు రోహిత్ శెట్టి కాప్ స్టోరీని ఎలివేట్ చేసేందుకు స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని స‌మాచారం. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన కాప్ యూనివ‌ర్శ్ విజువ‌ల్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళ్లాయి.
Tags:    

Similar News