మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచ్చార్య' భారీ అంచనాల మధ్య గత నెల 29న భారీ స్థాయిలో విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అనూహ్యంగా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నుంచి ఈ స్థాయి సినిమా వస్తుందని అభిమానులు కలలో కూడా ఊహించి వుండరు. ఈ సినిమా ఫలితంతో చాలా డిజప్పాయింట్ కు గురయ్యారట. అయితే ఇప్పడు మెగా ఫ్యాన్స్ కు మరో విషయం టెన్షన్ పెడుతోందని చెబుతున్నారు.
'ట్రిపుల్ ఆర్' తరువాత రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అక్కడ కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్ పాత్ర సరికొత్తగా వుండటంతో ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ గా ఫీలవుతున్నారట.
అయితే ఇదే సమయంలో ఈ చిత్ర ప్రారంభం నుంచి టెన్షన్ పెడుతున్నలీకుల కారణంగా అప్ సెట్ అవుతున్నారట. ఇటీవల 'ట్రిపుల్ ఆర్' ప్రమోషన్స్ కి ముందు ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరిగింది. 1930 కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో పిరియాడిక్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం యంగ్ చరణ్ మెలేసి మీస కట్టుతో.. వైట్ లుంగీ ధరించి సైకిల్ పై వెళుతున్న దృశ్యాలని చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట లీక్ అయి హల్ చల్ చేసింది.
అలాగే చరణ్ లుక్ కు సంబంధించిన ఫొటోలు ముందు లీక్ అవుతూ వచ్చాయి. లీకుల విషయంలో దర్శకుడు, నిర్మాత సంయుక్తంగా కలిసి లీకు రాజాలని హెచ్చరించినా అవి ఆగడం లేదు.
దీంతో ఈ విషయంలో గట్టి చర్యలతో పాటు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఫ్యాన్స్ నిర్మాతకు సూచిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ నుంచి త్వరలోనే చరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు.
ట్రిపుల్ ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చరణ్ నుంచి రానున్న భారీ సినిమా, అందులోనూ శంకర్ తో చేస్తున్న సినిమా కావడంతో ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే వరుస లీకులు ఆ అంచనాల్ని కిల్ చేసే విధంగా వున్నాయని, సినిమా రిలీజ్ కు ముందే అన్నీ బయటికి వచ్చేస్తుంటే సినిమాపై క్రేజ్ ఏముంటుందని వాపోతున్నారట. ఈ లీకులపై ఇప్పటికైనా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ సీరియస్ గా స్పందించి ఇకపై లీకులు జరక్కుండా చూసుకోవాలని చెబుతున్నారట.