దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత `వకీల్ సాబ్` సినిమాతో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ దఫా రీమేక్ మూవీతో తన రీఎంట్రీని ప్రారంభించారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. ఈ రీమేక్ తో మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన పవన్ ప్రస్తుతం ఈ ఫేజ్ చాలా కూల్ గా సాగిపోతుండటంతో రీమేక్ లకే అత్యథిక ప్రాధాన్యతనివ్వడం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఇటీవల `భీమ్లానాయక్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. దీంతో ఈ మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది. రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ మూవీకి పవన్ దాదాపుగా 50 కోట్లు పారితోషికం కింద తీసుకున్నారట. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత క్రిజ్ఞ్ డైరెక్ట్ చేస్తున్న ఫిక్షనల్ పరియాడిక్ డ్రామా `హరి హర వీరమల్లు`లో నటిస్తున్న పవన్ కల్యాణ్ ఈ మూవీతో పాటు మరో రీమేక్ ని పట్టాలెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే పవన్ మరిన్ని రీమేక్ లపై కన్నేశారని, మొత్తం మూడు చిత్రాల రీమేక్ లలో నటించడానికి ఆయన రెడీ అవుతున్నారని తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో సందడి చేస్తోంది.
తమిళంలో నటుడు, దర్శకుడు సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన `వినోదాయ సితం` చిత్ర రీమేక్ హక్కుల్ని ఇటీవలే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సొంతం చేసుకుందని, ఈ సంస్థతో కలిసి ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్, త్రివిక్రమ్ ఈ రీమేక్ ని పవన్ తో చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ మరో మూడు రీమేక్ చిత్రాలపై కన్నేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ఈ రీమేక్ కి 20 రోజుల డేట్స్ కేటాయించిన పవన్ కల్యాణ్ త్వరలోనే ఈ రీమేక్ ని సముద్రఖని డైరెక్షన్ లో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూనే వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా వ్యవహరించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఉన్నట్టుండి పవన్ వరుస రీమేక్ లపై కన్నేయడం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిందని చెబుతున్నారు. ఈ మూవీ తరువాత పవన్ ఏఏ సినిమాలని రీమేక్ చేయబోతున్నారన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతోందని చెబుతున్నారు. ఇదిలా వుంటే పవన్ రీమేక్ ల విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా వుండటం గమనార్హం