ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరి చివరి గమ్యస్థానం పాన్ ఇండియా. స్టార్ హీరోలు మొదలుకొని మీడియం రేంజ్ హీరోల వరకూ అందరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి.
హాలీవుడ్ హీరోని తలదన్నే కటౌట్ తో ఉండే మహేష్ తో హిందీ సినిమాలు చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎన్నాళ్ళుగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మన ప్రిన్స్ మాత్రం ఆ వైపుకు అడుగులు వేయలేదు. తెలుగు సినిమాలే చేసుకుంటూ వెళ్తున్నారు.
బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైన ప్రతీసారి.. తాను తెలుగు సినిమాలతో చాలా సంతోషంగా ఉన్నానని.. ఇక్కడ చేయాల్సింది చాలా ఉందని చెబుతూ వస్తున్నారు మహేశ్ బాబు. తెలుగు సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతుంటే హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయినప్పటికీ సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. లేటెస్టుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం హిందీ చిత్రాల దర్శకుడు సూరజ్ భర్జత్య.. మహేష్ తో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరేట్ డైరెక్టర్ సూరజ్.. 'మైనే ప్యార్ కియా' 'హమ్ ఆప్ కే హై కోన్' 'హమ్ సాత్ సాత్ హైన్' 'వివాహ్' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈయన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతుంటాయి. చివరగా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు.. ప్రస్తుతం 'ఊన్చాయ్' అనే మూవీ చేస్తున్నారు.
అయితే సూరజ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారట. ఇటీవల మహేశ్ నమ్రతను కలిసి ఓ స్టోరీ కూడా నేరేట్ చేసారట. నిజానికి పాన్ ఇండియా మూవీ చేయకుండానే నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న మహేష్ తో సినిమాలు చేసేందుకు అనేకమంది బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ రెడీగా ఉన్నారు. వీరంతా నమ్రత శిరోద్కర్ తో టచ్ లోనే ఉంటున్నారట.
కానీ సూపర్ స్టార్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. స్ట్రెయిట్ హిందీ సినిమా చేయడం కంటే.. తెలుగు చిత్రంతో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని ఆశ పడుతున్నారు. ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా అంటుంటే.. మహేష్ కూడా అలాంటి మూవీ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. త్వరలోనే వీరి కోరిక నెరవేరబోతోంది. రాబోయే సినిమాలతో నార్త్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేయబోతున్నారు మహేష్.
ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తోన్న మహేష్.. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఇదే క్రమంలో 'బాహుబలి' దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తో మహేష్ మూవీ ఉంటుంది. ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందే భారీ సినిమా అవుతుందని చెప్పవచ్చు. మరి దీని తర్వాత అయినా మనసు మార్చుకొని నేరుగా హిందీ చిత్రాలు చేయడానికి అంగీకరిస్తారేమో చూడాలి.