కత్రినాను వెనక్కి నెట్టేసిన సీరియల్ నటి

Update: 2016-12-14 05:30 GMT
ఆసియాలోనే అత్యంత సెక్సీయెస్ట్ మహిళ లిస్టులో ప్రియాంక చోప్రాను వెనక్కి నెట్టేసి దీపికా పదుకొనే అగ్రస్థానాన్ని అలంకరించేసిందంటూ మీడియాలో రెండు రోజులుగా ఒక వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘క్వాంటికో’ టీవీ సిరీస్ తో సూపర్ పాపులారిటీ సంపాదించి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అభిమానులుగా మార్చుకున్న ప్రియాంకను తోసిరాజని.. ఇంకా హాలీవుడ్ అరంగేట్రం చేయని దీపికకు అగ్రస్థానం ఎలా కట్టబెట్టేశారో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఐతే ఈ జాబితాలో దీనికంటే ఆశ్చర్యకరమైన అంశం మరొకటుందన్న సంగతి జనాలు మరిచిపోతున్నారు.

దీపికా పదుకొనే.. ప్రియాంక చోప్రాల తర్వాత స్థానంలో నిలిచింది ఒక టీవీ నటి కావడం ఆశ్చర్యమే. ఆమె పేరు నియా శర్మ. బాలీవుడ్ హీరోయిన్లలో సెక్సీ లిస్టు తీస్తే కత్రినా కైఫ్ ఎప్పుడూ అందులో టాప్ లెవెల్లో నిలుస్తుంటుంది. ఐతే కత్రినాతో పాటు ఆలియా భట్ ను కూడా వెనక్కి నెట్టి ఈ నియా శర్మ మూడో స్థానంలో నిలవడం విశేషం. హిందీలో నియా కొన్ని టీవీ సీరియళ్లలో నటించింది. వాటి ద్వారా అమ్మడికి మంచి పేరే వచ్చింది. ఐతే టీవీ సీరియళ్లు చూసేది ఫ్యామిలీ ఆడియన్సే అని తీసి పారేయకుండా నియాకు ‘సెక్సీయెస్ట్ వుమెన్’ జాబితాలో చోటివ్వడం ఆశ్చర్యమే. ఈ లిస్టులో చోటు దక్కింది కాబట్టి నియా.. మున్ముందు మంచి మంచి సినిమా అవకాశాలు కూడా పట్టేసినా పట్టేయొచ్చేమో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News