ముంబై బ్యూటీ నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ చందూ మొండేటి - అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే చైతు తమ్ముడు అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అఖిల్ సినిమా షూటింగ్ లో రీసెంట్ జాయిన్ అయింది ఈ భామ. ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలలో ఒకేసారి నటించే అరుదైన అవకాశం సాధించిన నిధి ఈమధ్య చైతు - అఖిల్ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు పంచుకుంది. అన్నదమ్ముల మధ్య తేడా ఏంటి అని అడిగితే చైతు ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వ్యక్తి అని చాలా టాలెంటెడ్ అని చెప్పింది. షూటింగ్ మొదటి రోజు నుండే తనను కంఫర్టబుల్ గా ఉంచేవాడని - తెలుగు తనకు అర్థం కాకపొతే వివరించేవాడని చెప్పింది.
ఇక అఖిల్ విషయానికి వస్తే ఫుల్ ఎనర్జీ తో ఉంటాడని - అందరితో కలిసిపోయే వ్యక్తి అని తెలిపింది. ఇక ఇద్దరి కి కామన్ గా ఉండే ఫీచర్స్ గురించి అడిగితే ఇద్దరి మ్యనరిజమ్స్ కొంచెం సిమిలర్ గా ఉంటాయని - ఇద్దరూ కలిసి పెరగడం వల్ల అలా ఉన్నారేమో అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏదేమైనా అక్కినేని అన్నదమ్ములను బాగానే స్కానింగ్ చేసింది బొంబాయి భామ!