'వర్కౌట్స్ నా అందాలను రెట్టింపు చేశాయి' అంటున్న కుర్ర హీరోయిన్..!!

Update: 2020-08-19 02:30 GMT
ఈ సినీ కళా ప్రపంచంలో కొందరు అదృష్టం కొద్ది హీరోయిన్ అవుతారు. మరికొందరేమో ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం హీరోయిన్ అవుతారు. ఇంకొందరేమో అనుకోకుండానే హీరోయిన్ అయిపోతారు. అయితే ఇందులో చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగి మొత్తానికి హీరోయిన్ అయిపోయిన కుర్రభామ నిధి అగర్వాల్. అమ్మడు మోడలింగులో రాణించి సినిమా అవకాశాలను దక్కించుకుంది. బాలీవుడ్ 'మున్నా మైకేల్' సినిమాతో హీరోయినుగా ఎంట్రీ ఇచ్చిన నిధి.. ఆ వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు అడుగులేసింది. కానీ హీరోయిన్లకి పట్టుదల పరువాలతో పాటు అదృష్టం కూడా కొంత కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో అదృష్టం ఆవగింజంత కూడా లేదట. ఎందుకంటే ఈ భామ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ తనకు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం అమ్మడు పొలిటిషన్ గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. అమ్మడు లాక్ డౌన్ లో సమయం వృథా చేయకుండా వర్కౌట్స్ పై దృష్టి పెడుతుందట. ఫిట్ గా ఉండటానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిధి చెబుతోంది. "లాక్డౌన్ నాకు చాలా ఉపయోగ పడుతుంది. ఈ టైంలో ఫిట్నెస్ సంబంధిత విషయాలు చాలా నేర్చుకున్నాను. అలాగే యోగా చేయడం ప్రారంభించాను. కొన్ని డిటాక్సింగ్ కూడా చేసాను. ఈ యోగా.. వర్కౌట్స్ అన్నీ నా శరీరాకృతిని మెరుగు పరుస్తాయని నేను భావిస్తున్నాను" అని నిధి చెప్పింది. ఇక ఆగష్టు 17తో 27 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ భామ తన పుట్టినరోజును సన్నిహితులతో, ఫ్యామిలీతో జరుపుకుందట. "నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. నా ఫ్యామిలీ మెంబెర్స్ తో అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్ తో వీలైనంత ఎక్కువ సమయం వారితో ఎంజాయ్ చేయాలనీ.. నా పుట్టినరోజున ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉంది. ఫ్యామిలీతో ఉండటం అంటే ఓ కల తీరినట్లుగా అనిపిస్తుంది. ఇదేగాక ఫ్యూచర్లో ఒక స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేయాలనీ ఉన్నట్లు తన మనసులో కోరికను బయట పెట్టింది నిధి భామ. ఇక త్వరలో వరుస సినిమాలతో అలరిస్తానంటుంది ఈ ఇస్మార్ట్ అమ్మడు. చూడాలి మరి నిధి అందాలు మరింత రెట్టింపు అయ్యాయేమో.. అని ఫ్యాన్స్ అంటున్నారు.
Tags:    

Similar News