హ‌లో బ్యూటీ అంటూ వెల్ కం చెప్పింది

Update: 2020-01-05 10:33 GMT
2020లో అడుగు పెడుతూ ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా సెల‌బ్రేషన్స్ జ‌రుపుకున్నారు. కొంద‌రు తార‌లు గోవా ట్రిప్ లో త‌రించారు. మ‌రికొంద‌రు ఇంట్లోనే కుటుంబ స‌మేతంగా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఇక ఈ కొత్త సంవ‌త్స‌రంలో అడుగు పెడుతున్న వేళ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ మాత్రం డిఫ‌రెంటుగా సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ అమ్మ‌డు ఖ‌రీదైన పోర్చ్ బ్రాండ్ కార్ ని కొనుక్కుంది. అంతేకాదు.. దానికి వెల్ కం చెప్పిన తీరు అంతే ఇంట్రెస్టింగ్.

హ‌లో బ్యూటీ.. అంటూ వెల్ కం చెప్పింది. 2020-30 వ‌ర‌కూ ఈ ద‌శాబ్ధం అంతా నువ్వే నాకు అండ‌గా అంటూ చాలా ఆశ‌గానే కోరింది. అంతా బాగానే ఉంది కానీ.. ఇస్మార్ట్ శంక‌ర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకునీ ఈ అమ్మ‌డు ఇంకా ఖాళీగానే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ క్రేజీగా ఒక్క పెద్ద సినిమాలోనూ అవ‌కాశం అందుకోలేదు. మ‌హేష్ మేన‌ల్లుడు గల్లా అశోక్ స‌ర‌స‌న ఒకే ఒక్క ఆఫ‌ర్ మిన‌హా ఇంకేదీ త‌న ఖాతాలో ప‌డ‌లేదు. అటు ముంబై ప‌రిశ్ర‌మ‌లోనూ నిధికి ఛాన్సుల్లేవ్ ఎందుక‌నో.

ఇక తెలుగు-హిందీలో ఛాన్సుల మాటేమో కానీ.. త‌మిళంలోనూ నిధి కెరీర్ ఏమంత లేదు. ప్ర‌స్తుతం అక్క‌డ ఓ సినిమా చేస్తోంద‌న్న స‌మాచారం ఉన్నా.. పెద్దంత‌గా ప్ర‌చారార్భాటం క‌నిపించ‌లేదు. ట్యాలెంట్ తో పాటు ల‌క్ క‌లిసి రాక‌పోతే ఎలా ఉంటుందో ఈ అమ్మ‌డి కెరీరే బెస్ట్ ఎగ్జాంపుల్.  క‌నీసం ఖ‌రీదైన కార్ అయినా త‌న‌కు ల‌క్కీ ఛామ్ గా క‌లిసొస్తుందేమో చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News