షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా కూడా మెజార్టీ స్టార్స్ షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒక్కరు ఇద్దరు హీరోయిన్స్ మినహా ఎవరు కూడా షూటింగ్స్ లో జాయిన్ అయ్యేందుకు ముందుకు రావడం లేదు. ఈ ఏడాదిలో అసలు షూటింగ్స్ కు రాలేమంటూ కొందరు హీరోయిన్స్ ప్రకటించగా మరికొందరు మాత్రం కరోనా తగ్గుముఖం పట్టే వరకు షూటింగ్స్ కు హాజరు కామని తేల్చి చెప్పారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా అదే ప్రకటన చేసింది.
కరోనా కారణంగా గత మూడు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన నిధి అగర్వాల్ షూటింగ్ కు ఎప్పుడు హాజరు కాబోతున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో ఇప్పట్లో ఆలోచన లేదన్నట్లుగా చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు బయటకు వెళ్లలేదని కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా తాను షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు సిద్దంగా లేనంటూ పేర్కొంది. మరికొన్నాళ్ల పాటు ఇంట్లోనే పూర్తిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.
తల్లిదండ్రులు సోదరితో కలిసి చాలా మంచి సమయంను స్పెండ్ చేస్తున్నట్లుగా పేర్కొంది. బయటి ఫుడ్ కాకుండా పూర్తిగా ఇంటి ఫుడ్ నే తింటున్నాం. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఆన్ లైన్ ఫిల్మ్ మేకింగ్ కోర్సును పూర్తి చేసినట్లుగా చెప్పిన నిధి తన జీవితంలో ఎప్పుడు ఇంతగా చుడిదార్ వేసుకోలేదని ఇంట్లోనే ఉంటున్న కారణంగా ఎప్పుడు కూడా చుడిదార్ లోనే ఉంటున్నట్లుగా పేర్కొంది. కొత్త డ్రస్ లు తీసుకోవడం.. షాపింగ్ చేయడం అనేది పూర్తిగా మర్చిపోయినట్లు అయ్యిందని ఆమె పేర్కొంది.