ఇస్మార్ట్ బ్యూటీ క్వారంటైన్ ఎవరితోనో తెలుసా?

Update: 2020-06-30 07:00 GMT
అక్కినేని హీరోలు నాగ‌చైత‌న్య‌.. అఖిల్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది నిధి అగ‌ర్వాల్. డెబ్యూ నాయిక‌గా విజ‌యాలు అందుకోక‌పోయినా నిధి ట్యాలెంట్ ని టాలీవుడ్ గుర్తించింది. ముఖ్యంగా నిధిలో గ్లామ‌ర్ యాంగిల్ డ్యాన్సింగ్ స్కిల్ కి మెచ్చి పూరి జ‌గ‌న్నాథ్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ అవ‌కాశం ఇచ్చారు. రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో నిధి ఫేట్ మారిపోతుంద‌నే భావించినా ఎందుక‌నో ఆశించినంత క్రేజీ ఆఫ‌ర్లు అయితే రాలేదు.

ఆ క్ర‌మంలోనే మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ స‌ర‌స‌న ఓ సినిమాకి క‌మిటైంది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ క్రైసిస్ లో ఆ మూవీ ఏమైందో స‌రైన స‌మాచారం లేదు. ఆ మూవీ ఔట్ పుట్ బాగా రాక‌పోవ‌డంతో స్క్రాప్ లో వేశార‌ని కూడా అప్ప‌ట్లో ప్ర‌చార‌మైపోయింది. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ  స‌ర‌సన ఓ మూవీకి నిధి పేరు ప‌రిశీలించినా ఖాయం చేశార‌నే దానిపై అప్ డేట్ లేనే లేదు. త‌మిళంలో `భూమి` అనే చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్రైసిస్ వ‌ల్ల వాయిదా ప‌డింది.

ఈలోగా ఫ్యాన్స్ త‌న‌ని మ‌ర్చిపోకుండా నిధి సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ గానే ఉంది. అక్క‌డ రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ట‌చ్ లో ఉంటోంది. తాజాగా త‌న పెట్ డాగ్స్ తో క‌లిసి నిధి ఇచ్చిన ఫోజు ఫ్యాన్స్ లో వైర‌ల్ గా మారింది. ట్రెడిష‌న‌ల్ పంజాబీ డ్రెస్ లో ఎంతో  క్యాజువ‌ల్ గా క‌నిపిస్తున్న నిధిలో ఈ కొత్త యాంగిల్ నెటిజ‌నుల్ని బాగానే ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News