మెగా వారి ఇంట పెళ్లి జరిగి నెలన్నర అవుతున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి సందడి కంటిన్యూ అవుతూనే ఉంది. నిహారిక చైతన్యల పెళ్లి ఫొటోలు లేదా వీడియోలు ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ లోనే ఉంటున్నాయి. నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి వీడియోలు మరియు ఫొటోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ వచ్చాడు. ఈసారి నిహారిక వంతు వచ్చింది. ఆమె తన జ్ఞాపకాలను షేర్ చేసింది. వీడియోలో ఆమె ఆనందంతో నవ్వుతూ కన్నీరు పెట్టుకోవడం చాలా ఎమోషనల్ గా ఉంది.
పెళ్లి వీడియోను నిహారిక షేర్ చేసింది. దాదాపు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో మొదట నిహారిక పెళ్లి ల్యాప్ టాప్ లో ఫొటోలు వీడియోలు చూస్తూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి సందడి షురూ అయ్యింది. మెగా వారిని అందరిని చూపించి వీడియోలో మరోసారి కన్నుల పండుగ చేసింది. చైతన్య తాళి కడుతున్న సమయంలో నిహారిక కన్నీరు పెట్టుకుంది. ఇక సరదాగా జరిగిన తలంబ్రాల తంతు ఆ తర్వాత జరిగిన బిందెలో ఉంగరం ఆట అన్నింటిని కూడా వీడియో ద్వారా నిహారిక చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Full View