ఇటీవల కొంతకాలంగా మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అందమైన జంట చైతన్య- నిహారిక మధ్య విభేధాలు తలెత్తాయని విడాకులు తీసుకుంటున్నారని కథనాలు వైరల్ అవ్వడం అభిమానులను కలతకు గురి చేశాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం ఆ కుటుంబాలు ఇవ్వలేదు. ఇప్పటికి కేవలం ఇవన్నీ మీడియా ఊహాగానాలు మాత్రమే.
అయితే ఆ ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాల్లో అన్ ఫాలో చేసుకోవడం జంటగా ఉన్న ఫోటోలను తొలగించడంతో మీడియా ఊహాత్మక కథనాలను వెలువరించింది. అయితే ఈ వార్తలు నిజమా? కాదా? అనేదానికి మెగా డాటర్ నుంచి ఎలాంటి సమాధానం లేదు.
ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన వెలువడలేదు. లేదా బహిరంగంగా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. ఇది పూర్తిగా నిహారిక వ్యక్తిగత విషయం కాబట్టి మీడియా గోప్యతను పాటించడం కూడా అవసరం.
అయితే కొంత గ్యాప్ తర్వాత ఓటీటీ సిరీస్ లతో నిహారిక తిరిగి నటనా జీవితాన్ని ప్రారంభించడం అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. తాజాగా 'డెడ్ పిక్సెల్స్' అనే వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తోంది. ఈ సిరీస్ మే19న OTTలో విడుదల కానుంది. ట్రైలర్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. నిహారిక ఈ సిరీస్ లో గాయత్రి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది.
ఈ సిరీస్ లో రోషన్ - భార్గవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి ప్రచారం చేస్తున్నప్పుడు నిహారిక వ్యక్తిగత జీవితంపై మీడియా ప్రశ్నలు సంధించింది. అయితే నిహారిక ఆ ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేయడం గుసగుసలకు తావిచ్చింది. భర్త చైతన్య జొన్నలగడ్డతో విభేదాలపై ప్రశ్నకు నిహారిక ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అలాగని దానిని ఖండించనూ లేదు. వైవాహిక స్థితిపై నిహారిక పూర్తిగా మౌనం వహించింది.
అయితే నిహారిక ఇప్పుడు తిరిగి తన జీవిత లక్ష్యాలను సాధించుకునే మార్గంలో ఉంది. నటన అంటే తనకు ఎప్పుడూ ఇష్టం. తిరిగి దానిని కొనసాగిస్తోంది. చాలా మంది స్టార్ డాటర్స్ తరహాలోనే నిహారిక కంబ్యాక్ అద్భుతంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. నిహారికకు సినీరంగంలో ఎంతో భవిష్యత్ ఉంది. అయితే దానికి తగ్గట్టు ప్రణాళికలు అవసరం.