ఒకోసారి పరిస్థితులు అంతే.. ఎంత పెద్దోళ్లయినా పరిస్థితికి తలొగ్గాల్సిందే. ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాలను చూస్తే.. ఓ ఆశ్చర్యకరమైన విషయం అర్ధమవుతుంది. ఈరోజు (జూన్ 24) రిలీజ్ లు మూడున్నాయి. ఒకటి కుందనపు బొమ్మ.. రెండు రాజాధి రాజా.. మూడు ఒక మనసు.
ఇప్పుడు అంతా ఒకమనసు గురించే టాక్ నడుస్తోంది. మెగా డాటర్ నీహారిక ఎంట్రీ కారణంగా.. ఒకమనసు మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి నెలకొంది. నాగశౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సినిమా. ఇదంతా నీహారిక ప్రభావమే అనడంలో సందేహం లేదు. అయితే.. నీహారిక కారణంగా పెద్ద పెద్ద పేర్లున్నా ఇతర చిత్రాల పేర్లు పెద్దగా న్యూస్ లోకి రాకపోవడం ఆశ్చర్యకరం. కుందనపు బొమ్మను తీసుకుంటే.. ఈ మూవీని రాఘవేంద్రరావు సమర్పించారు. అలాగే సంగీతం అందించినది కూడా ఎంఎం కీరవాణి. ఇద్దరు దిగ్గజాలు ఉన్నా కుందనపు బొమ్మకు హైప్ రావడం లేదు.
ఇక రాజాధిరాజా పరిస్థితి కూడా ఇంతే. శర్వానంద్-నిత్యామీనన్ లాంటి ట్యాలెంటెడ్ నటులు ఉన్నా.. ఈ మూవీని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీని విషయంలో అయితే వారెవరూ ప్రమోషన్స్ చేయకపోవడం కూడా కారణమే అయినా.. మరీ అసలు కేర్ చేయని సిట్యుయేషన్ కి మాత్రం రీజన్ మెగాడాటర్. అలా నీహారిక నీడ ఈ తెలిసిన దిగ్గజాల పేర్లనే కమ్మేసింది.