నాగబాబు తనయురాలు కొణిదెల నిహారిక కథానాయికగా నటించిన తొలి సినిమా ‘ఒక మనసు’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. పాజిటివ్ బజ్ మధ్య రిలీజైన ఈ చిత్రం ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. నిహారికకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కెరీర్ ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడిపోయినట్లయిందామెకు. ఆ ప్రభావంతో వెంటనే ఇంకో సినిమా ఒప్పుకోలేదు నిహారిక. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోందీ మెగా ఫ్యామిలీ అమ్మాయి. మరి ఈ మూడేళ్లలో నిహారికకు ‘హ్యాపీ వెడ్డింగ్’ కాక నిహారిక వేరే అవకాశాలేమీ రాలేదా అన్న సందేహం జనాల్లో ఉంది. ఐతే అలాంటిదేమీ లేదని.. అవకాశాలు చాలానే వచ్చాయని.. తాను మధ్యలో 8 కథలు విన్నానని.. వాటన్నింటికీ నో చెప్పానని నిహారిక వెల్లడించింది.
తాను విన్న కథల్లో కొన్ని నచ్చలేదని.. కొన్నింటికి తాను నప్పనని అనిపించిందని.. అందుకే వాటిలో ఏదీ ఎంచుకోలేదని నిహారిక చెప్పింది. ‘ఒక మనసు’ సినిమా చేయాలన్నది తనకు తాను తీసుకున్న నిర్ణయమని.. తన తండ్రి ఈ సినిమా విషయంలో వారించినా ఒప్పుకున్నానని.. కానీ అందులో తాను చేసిన సంధ్య లాంటి పాత్రలు అరుదుగా వస్తాయని.. అందుకే ఆ చిత్రం చేశానని నిహారిక తెలిపింది. ఆ సినిమా విషయంలో తనకు బాధేమీ లేదని.. అందులో కొన్ని పాటలు.. ఫ్రేమ్స్ ఇప్పటికీ తనకు నచ్చుతాయని.. సినిమా నుంచి ఏం నేర్చుకోవాలో అదంతా దాన్నుంచి నేర్చుకున్నానని నిహారిక తెలిపింది. తాను ఏ పాత్ర ఎంచుకున్నా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటానని.. పాటకు ముందు రా.. తర్వాత వెళ్లిపో అంటే తనకు నచ్చదని.. అలాగని కథంతా తన చుట్టూనే తిరగాలని కూడా తాను కోరుకోనని నిహారిక చెప్పింది.