మెగా డాటర్ కి వంటొచ్చా?

Update: 2016-06-23 04:01 GMT
మెగా డాటర్ నీహారిక హీరోయిన్ గా నటించిన తొలి సినిమా ఒక మనసు రేపే రిలీజ్ కానుంది. తన తొలి మూవీనే రొమాంటిక్ చిత్రాన్ని ఎంచుకుని మొదట్లోనే ఆశ్చర్యపరిచిన నీహారిక.. ఇప్పుడు తన ట్యాలెంట్ తో మెస్మరైజ్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇవాళ మెగా ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్ ప్రీమియర్ చూపించి.. తన యాక్టింగ్ పై రియాక్షన్ ను స్వయంగా తెలుసుకోనుంది.

ఒక మనసు ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉన్న నీహారికకు.. అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఫ్యాన్స్ గురించి కొన్నైతే.. ఫ్యామిలీ గురించి కొన్ని.. పవన్ గురించి మరి కొన్ని. అలాగే పర్సనల్ గా అడిగినా బెరుకు లేకుండా ఆన్సర్ ఇచ్చేయగల ట్యాలెంట్ ఈమెకు ఉంది. అలాగే ఈమెకు ఎదురైన ఓ చిలిపి ప్రశ్న.. మెగా డాటర్ కి వంటొచ్చా? ఈ కాలం అమ్మాయిల్లో గరిట పట్టుకునే వాళ్లు తక్కువ మందే ఉంటారు కానీ.. నీహారికకు వంటింటకి మరీ అంత దూరమేం లేదనే విషయం ఆమె ఆన్సర్ లోనే తెలుస్తోంది.

'వంకాయ పచ్చడి.. పప్పు.. ఈ రెండు చేయడం నాకు  బ్రహ్మాండంగా వచ్చు' ఇదీ మెగాడాటర్ ఇచ్చిన స్మార్ట్ ఆన్సర్. ఇవి బ్రహ్మాండంగా వచ్చంటే.. మిగిలిన వంటకాలతో కూడా అంతో ఇంతో పరిచయం ఉన్నట్లే కదా. వండేవాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి అని ఈ చిన్నదాన్ని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? 'ఏదైనా వండండి.. ఏ కూరైనా చేయండి.. మీరేం వండినా సరే చివర్లో ఉప్పెయ్యడం మర్చిపోకండి' అని చెప్పింది మెగా డాటర్. బహుశా అలా వండి పెట్టేసిన ఎక్స్ పీరియన్స్ ఉందేమో.
Tags:    

Similar News