ఇది రాంగ్ టైమ్ ఏమో నిహారిక!!

Update: 2016-08-24 17:30 GMT
మెగా డాటర్ కొణిదెల నిహారిక తన తొలి సినిమా 'ఒక మనసు'తో పెద్దగా ప్రూవ్ చేసుకోకపోయినా కూడా.. ఆ సినిమాకు వచ్చిన వసూళ్ళు చూస్తూ అమ్మడు ఏ రేంజులో ఆదరణ సాధించగలదో తెలుస్తుంది. అయితే తన రెండో సినిమాపై ఫోకస్ చేయాల్సిన ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు మరోసారి యుట్యూబ్ మీదనే ఫోకస్ పెడుతోంది అంటూ వార్తలొస్తున్నాయి.

నిజానికి ''ముద్దపప్పు ఆవకాయి'' అనే వెబ్ సిరీస్ తీసిన తరువాతనే నిహారిక బీభత్సంగా పాపులర్ అయ్యింది. అప్పటివరకు కో-యాంకర్ గా తనకు ఎంత ఇమేజ్ వచ్చినప్పటికీ.. ఈ దెబ్బతో ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడిక తన తొలి సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు కాబట్టి.. మరోసారి వెబ్ సిరీస్ తో వస్తోంది నిహారిక అంటున్నారు. నిజానికి ఎప్పుడైతే తన తొలి వెబ్ సిరీస్ హిట్టయ్యిందో.. అప్పుడే అమ్మడు మరో రెండు వెబ్ సిరీస్ లు కూడా తీసి ఉంచేసిందట. కాస్త కాస్త గ్యాప్ ఇచ్చి ప్రమోట్ చేసి ఒక్కొక్కటీ రిలీజ్ చేయాలనేది ప్లాన్. అదిగో ఇప్పుడు ఆల్రెడీ తీసిన తన రెండో వెబ్ సిరీస్ ను రిలీజ్ చేస్తోంది తప్పించి.. కొత్తగా ఇప్పుడేదీ షూట్ చేయట్లేదు అని తెలుస్తోంది.

ఏదేమైనా కూడా.. రెండో సినిమా ప్రకటన చేయకుండా ఇలా మరో వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే మాత్రం.. అవకాశాలు లేకనే మళ్లీ యుట్యూబ్ లోకి వచ్చిందని అనుకుంటారు. ఇది రాంగ్ టైమ్ ఏమో నిహారిక.. ఏక్ బార్ సోచ్ లో!!

Tags:    

Similar News