మెగాస్టార్ తో ఒక్క నిముషం కలిసి నటించినా చాలు!

Update: 2019-03-29 09:40 GMT
మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ మాత్రం నాగబాబు కుమార్తె నిహారిక.  హీరోయిన్ గా నటించిన 'ఒక మనసు'.. 'హ్యాపీ వెడ్డింగ్' రెండూ నిరాశను మిగిల్చాయి.  నిహారిక కొత్త సినిమా 'సూర్యకాంతం' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటోంది నిహారిక.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం 'సైరా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో నిహారిక ఒక స్పెషల్ రోల్ చేస్తోందట.  మొదట్లో ఈ వార్తను రూమర్ అనుకున్నారు కానీ నిహారిక ఉన్న 'సైరా' ఆన్ లొకేషన్ పిక్ ఒకటి బయటకు రావడంతో నిహారిక నటించడం పక్కా అని అనుకున్నారు.  నిహారిక కూడా 'సైరా' లో నటిస్తున్నానని తర్వాత వెల్లడించింది. 'సైరా' లో రెండు సీన్స్ లో మాత్రమే కనిపిస్తానని.. అందులో ఒక సన్నివేశం చాలా ప్రత్యేకమైనదని తెలిపింది. ఆ సీన్ లో తన నటన ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతుందని వెల్లడించింది.  మెగాస్టార్ సినిమాలో నటించాలని కలలు కన్నానని.. ఆయన సినిమాలో ఒక్క నిముషం పాటు కనిపించినా చాలని.. ఆ కల 'సైరా' ద్వారా తీరుతోందని తెలిపింది.

'సూర్యకాంతం' గురించి మాట్లాడుతూ ప్రేక్షకులకు తప్పకుండా మెప్పించే ఎంటర్టైనర్ అని నమ్మకం వ్యక్తం చేసింది.  ఇంతకు ముందు నటించిన రెండు సినిమాలకు రిలీజ్ టైమింగ్ మైనస్ అయిందని.. కానీ 'సూర్యకాంతం' సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ కావడం ప్లస్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.
    

Tags:    

Similar News