మెగా అమ్మాయి అడ్రస్ లేదేంటి?

Update: 2016-07-05 13:30 GMT
తన తొలి సినిమా సెట్స్ మీదికి వెళ్లడంతోనే మీడియాలో బాగా హైలైట్ అయింది కొణిదెల నిహారిక. సినిమాల్లో నటించాలన్న తన బలమైన కోరికను పట్టుబట్టి నెరవేర్చుకున్న నిహారిక.. మంచి కాంబినేషన్లో తొలి సినిమా చేసింది. ఆమె తొలి సినిమా ‘ఒక మనసు’కు మంచి హైప్ కూడా వచ్చింది. కానీ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఐతే విడుదలకు ముందు మీడియా వాళ్లను తెగ కలిసేస్తూ.. మెగా అభిమానులతో స్పెషల్ మీట్లో పాల్గొంటూ.. ప్రింట్-ఎలక్ట్రానిక్-వెబ్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ కనిపించిన నిహారిక.. సినిమా విడుదల తర్వాత మాత్రం అడ్రస్ లేదు.

సినిమాకు కమర్షియల్ గా ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ ‘ఒక మనసు’ మంచి ప్రయత్నమే. దర్శకుడు రామరాజు సిన్సియర్ గా ఓ లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేశాడు. సెన్సిటివ్ లవ్ స్టోరీల్ని ఇష్టపడేవాళ్లను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. ఐతే సినిమాకు సరైన ప్రమోషన్ లేకపోవడంతో చివరికి డిజాస్టర్ గా నిలిచింది ‘ఒక మనసు’. హీరో హీరోయిన్లు ఈ సినిమాను ప్రమోట్ చేసి ఉంటే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేదేమో. అందులోనూ తొలి సినిమా చేసిన నిహారిక విడుదల తర్వాత ఒక్కసారీ మాట్లాడకపోవడం.. కనీసం తన నటనకు వస్తున్న స్పందన గురించి కూడా రెస్పాండవకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి ఈ సినిమా విషయంలో నిహారిక నటన గురించి జనాలు పాజిటివ్ గానే మాట్లాడుకున్నారు. దాని గురించైనా ఒక నిహారిక ఒక బైట్ ఇవ్వాల్సిందే. ఏమీ చేయకుండా సైలెంటుగా ఉండిపోవడం ఆమె కెరీర్ కు కూడా అంత మంచిది కాదేమో.
Tags:    

Similar News