ఫస్ట్ లుక్: సూర్యకాంతం అవతారం!

Update: 2018-12-18 06:07 GMT
మెగా హీరోయిన్ నిహారిక 'సూర్యకాంతం' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు ప్రణీత్. బీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తాజగా నిహారిక సోదరుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశాడు.  ఫస్ట్ లుక్ లో హీరో.. హీరోయిన్లు రెండు షేడ్స్ లో కనిపించారు.

దూరదర్శన్ సింబల్ ను పోలి ఉన్న సింబల్ లో ఒక హాఫ్ వైట్ డిజైన్.. మరో సగం బ్లాక్ డిజైన్.  వైట్ డిజైన్ లో ఇద్దరూ తెలుపు రంగులు దుస్తులు ధరించి ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు.  భుజానికి తెలుపు రంగు టాటూ లాంటి డిజైన్.. తలలో తెలుగు రంగు పూలతో నిహారిక ఎంతో ప్రేమతో హీరోను హగ్ చేసుకుంది. ఇక బ్లాక్ డిజైన్ లో మాత్రం ఒక రాక్షసి లాగా మారి హీరోను కుమ్మేసింది.  అతని మోహాని పై గాయాలు కూడా ఉన్నాయి. పళ్ళు పటపటా కొరుకుతూ జుట్టు పట్టుకొని లాగుతోంది.  అంటే సుర్యకాంతం పేరును ఫుల్ గా జస్టిఫై చేస్తోంది.  న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. 
 
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని త్వరలో రిలీజ్ డేట్ ఇతర వివరాలు ప్రకటిస్తారని సమాచారం.  మార్క్ రాబిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  నిర్వాణ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  వరుణ్ తేజ్ ఈ సినిమాను సమర్పిస్తుండడం విశేషం. 
Tags:    

Similar News