మెగా ఇంటి అమ్మాయి.. నాగబాబు కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. గలగలాడే సెలయేరుగా పెదాల మీద చెరగని నవ్వుతో కనిపించే ఈ అమ్మాయి మరో రెండు వారాల్లో (కచ్ఛితంగా చెప్పాలంటే 12 రోజులు) ఒక మనసు చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన అబ్బాయిలు వారసులుగా వెండితెర మీదకు మామూలే. కానీ.. ఇలాంటి ఇంటి నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా రావటం చాలా అరుదు. అలాంటి స్పెషల్ నిహారిక సొంతం.
పెద్దింటి అమ్మాయి అన్న ఫోజ్ లేకుండా అమ్మాయి పనులు చూస్తే ఆశ్చర్యకరంగానే కాదు.. ఇలాంటి అటిట్యూడ్ ఉండటం చాలా తక్కువ సుమా అన్న భావన కలగటం ఖాయం. తనకు సంబంధించిన వివరాలతో తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తనకు సంబంధించి చెప్పిన ఒక మాట విన్నప్పుడు నిహారిక మీద మరింత గౌరవభావం కలగటం ఖాయం.
పెద్దనాన్న చిరంజీవి.. బాబాయ్ పవన్ కల్యాణ్.. చరణ్.. బన్నీ.. వరుణ్.. సాయి ధరమ్ లాంటి హీరోల ఇంట అమ్మాయి ఒక కాఫీ క్లబ్ లో పని చేయటమా? వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. రకరకాల మనుషుల్ని కలవటానికి.. కల్చర్స్ తెలుసుకోవటం కోసం నిహారిక ఏం చేసిందో తెలుసా? ఏకంగా కాఫీ క్లబ్ లో పని చేసింది. సినిమాటిక్ గా అనిపించినా.. తనకు నచ్చిన పనిని చేయటానికి తండ్రి నాగబాబును అడగటం.. ఎందుకిలా? అన్న ప్రశ్నకు నీహారిక చెప్పిన మాటతో నో చెప్పలేక నాగబాబు ఓకే చెప్పేశారని చెప్పుకొచ్చింది నీహారిక.
దీంతో ఆమె ఫిలింక్లబ్ లో ఉన్న కాఫీ క్లబ్ లో పని చేశారు. వారానికి వెయ్యి రూపాయిల జీతానికి పని చేసిన నీహారిక తొలి సంపాదన వెయ్యి రూపాయిలు. సంపాదించటం మొదలెట్టిన తర్వాతే డబ్బు విలువ తెలిసిందని.. ఈ మధ్యనే ఆఫీసు ఒక ఓపెన్ చేసి.. ఖర్చుల లెక్కలు చూసుకోవటం మొదలెట్టాక డబ్బు మీద మరింత గౌరవం పెరిగిందని చెప్పింది. సరదాగా ఎంజాయ్ చేయాలని అందరూ అనుకునే వయసులో ఇంత మెచ్యూరిటీ అభినందించాల్సిందే.