న‌న్ను బ్యాంకు లాంటోడు అంటే బావుంది

Update: 2015-12-06 09:30 GMT
అంద‌రూ వెళ్లే దారిలో వెళితే ప్ర‌యోజ‌నం ఏం ఉంటుంది? అని ప్ర‌శ్నించుకున్నాడేమో నిఖిల్‌. త‌న‌కంటూ ఓ స‌ప‌రేట్ రూట్ ఎంచుకున్నాడు. క‌ష్ట‌మొచ్చినా, న‌ష్ట‌మొచ్చినా అందులోనే ప్ర‌యాణిస్తున్నాడు. కానీ ఆరంభం మూడు విజ‌యాలు అత‌డిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మూడు సినిమాలు డిఫ‌రెంట్ జోన‌ర్‌ ల‌లో రిలీజై పెద్ద విజ‌యాన్ని అందించాయి. స్వామిరారా - కార్తికేయ‌ - సూర్య వ‌ర్సెస్ సూర్య అత‌డిని పెద్ద స్టార్‌ ని చేశాయి.  

ఈ సినిమాల‌తో అత‌డు బ్యాంక‌బుల్ హీరో  అన్న పేరొచ్చింది. నిఖిల్‌ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ ఉంద‌న్న ఐడెంటిటీ వ‌చ్చింది. అదే ఐడెంటిటీ అత‌డు న‌టించిన శంక‌రాభ‌ర‌ణం ఓపెనింగ్స్‌ కి పెద్ద ప్ల‌స్ అయ్యింద‌ని చెబుతున్నాడు నిఖిల్‌. ఈ సినిమాని ఏకంగా 600 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశాం. ఇంత భారీగా రిలీజ్ చేస్తున్నందుకు థియేట‌ర్ల‌లో జ‌నాలు క‌నిపిస్తారా అని ఆరంభం భ‌య‌పడ్డాం. కానీ తొలిరోజు ఓపెనింగులు అదిరిపోయాయ్ అంటూ చెప్పుకొచ్చాడు.  అయితే శంక‌రాభ‌ర‌ణం చిత్రానికి ఆరంభ‌మే ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. జ‌నాల్లో నెగెటివ్ టాక్ వినిపించింది. అయినా ఈ సినిమాని జ‌నాలు ఆమాత్రం అయినా ఆద‌రించారంటే నిఖిల్ వ‌ల్ల‌నే. అత‌డిలోని ఎక్స్‌పెరిమెంట‌ల్ యాటిట్యూడ్ వ‌ల్ల‌నే. ఇమేజ్‌ ఓ రేంజులో పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.

ఏదేమైనా త‌న‌ని ఇలా బ్యాంక‌బుల్ హీరో అని పిల‌వ‌డాన్ని చాలా సంతోషంగా ఉంద‌ని చెబుతున్నాడు నిఖిల్‌. అతడు నిర్మాత‌ల‌కు బ్యాంకులా ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. అంతా హ్యాపీసే మ‌రి!
Tags:    

Similar News