నిఖిల్ నిజంగానే పెరిగాడే

Update: 2017-07-18 06:22 GMT
ఆన్ స్క్రీన్ పై వైవిధ్యంగా కనిపించేందుకు.. మేకప్ వేసుకోవడం ఒకటే గతంలో మార్గంగా ఉండేది. మేకప్ కొత్తగా ట్రై చేసి.. నటనలో తేడా చూపించేవారు. కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం.. నిజంగానే తమను తాము మార్చేసుకుంటున్నారు. హెయిర్ స్టైల్ నుంచి ఫిజిక్ వరకూ రియల్ గానే తేడా చూపిస్తున్నారు.

ఈ లిస్ట్ లో ఇప్పుడు యంగ్ హీరో నిఖిల్ కూడా జాయిన్ అయిపోయాడు. హ్యాపీడేస్ లో కనిపించిన నిఖిల్ కి.. ఇప్పటి యంగ్ హీరోకు ఎంతో తేడా ఉందని చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం నిఖిల్ బరువు పెరగాలని ఫిక్స్ అయిపోవడమే కాదు.. ఇప్పటికే బరువు పెరిగిపోయాడు కూడా. కన్నడ బ్లాక్ బస్టర్ కిర్రాక్ పార్టీ రీమేక్ లో నటించనున్న నిఖిల్.. ఆ సినిమాలో హీరో పాత్ర కోసం కాసింత బరువు పెరగాల్సి ఉంటుంది. అందుకే లండన్ లో వాలిపోయిన నిఖిల్.. స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని.. నిజంగానే 10 కిలోల బరువు పెరుగుతుండడం విశేషం. కండలు పెంచిన బాడీతో కనిపిస్తున్న నిఖిల్ ఫోటోలు.. ఇప్పడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

వరుసగా విజయాలతో ఊపు మీద ఉన్న నిఖిల్ ను.. కేశవ యావరేజ్ గా మిలగడం కాసింత డిజప్పాయింట్ చేసింది. అందుకే తన మరుసటి చిత్రాల విషయంలో మరింతగా కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కిర్రాక్ పార్టీ తెలుగు రీమేక్ లో నటించనున్న నిఖిల్.. ఆ తర్వాత తమిళ హిట్ మూవీ గణితన్ ను తెలుగు రీమేక్ లో.. దిల్ రాజ్ బ్యానర్ పై చందూ మొండేటి దర్శకత్వంలో నటించనున్నాడు.
Tags:    

Similar News