కుర్ర హీరో నిఖిల్ కెరీర్ లో మేజర్ బ్రేక్ గా నిలిచిన మూవీ కార్తికేయ. ఒక చిన్న థ్రిల్లర్ లైన్ ని తీసుకుని గుప్త నిధుల కాన్సెప్ట్ తో దర్శకుడు చందు మొండేటి రూపొందించిన తీరు ప్రశంశలతో పాటు వసూళ్లను తెచ్చిపెట్టింది.స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించిన కార్తికేయ తక్కువ బడ్జెట్ లో రూపొందించినప్పటికి ఆ ఏడాది వచ్చిన సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీని తర్వాత నిఖిల్ మరింత వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. గత కొంత కాలంగా కార్తికేయకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ సినిమా క్లైమాక్స్ లో అడిగి వదిలేసిన ప్రశ్నలకు సమాధానాలతో ఇది కంటిన్యూ అవుతుందని ప్రచారం జరిగింది.
కానీ విశ్వసనీయ సమాచారం మేరకు కార్తికేయ సీక్వెల్ ఆలోచన పూర్తిగా విరమించుకున్నట్టు తెలిసింది. స్క్రిప్ట్ అనుకున్న విధంగా రాకపోవడంతో పాటు టాలీవుడ్ లో ఇప్పటి దాకా బాహుబలిని మినహాయిస్తే ఏ ఒక్క సీక్వెల్ సక్సెస్ కాలేదు.చిరంజీవి-పవన్ కళ్యాణ్-వెంకటేష్-రవితేజ-వీళ్ళందరూ చేదు ఫలితన్ని చూసినవాళ్లే. ఆరకంగా సెంటిమెంట్ యాంగిల్ లో కూడా ఆలోచించినట్టు టాక్. సీక్వెల్ అనగానే మొదటి భాగం కంటే ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారని అందుకే అనవసరమైన రిస్క్ జోలికి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇది నిఖిల్ ఫాన్స్ కు రుచించని వార్తే అయినప్పటికీ ఇంకో రకంగా చూస్తే ఇదే కరెక్ట్ అనిపించక మానదు. నిఖిల్ ప్రస్తుతం ముద్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తమిళ హిట్ కనితన్ కు రీమేక్ గా ఇది రూపొందుతున్న సంగతి తెలిసిందే.