మాజీ ప్రధాని మనవడు.. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజ నేత కుమారుడు - హీరో - నాయకుడి పెళ్లి కరోనా లాక్ డౌన్ లో సింపుల్ గా మమ అనేట్టు ముగిసింది. మామూలుగానే కన్నడ నాట పెళ్లిళ్లంటే ఆకాశమంతా పందిరి - భూదేవంతా పరదాలు పరిచి అంగరంగ వైభవంగా సాగుతాయి. కానీ మాజీ సీఎం కుమారుడు - హీరో పెళ్లి ఇలా సాదాసీదాగా ఫాంహౌస్ లో ముగియడం గమనార్హం.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు - హీరో నిఖిల్ గౌడ వివాహం శుక్రవారం ఉదయం ఫామ్ హౌస్ లో చాలా సింపుల్ గా జరిగింది. తెలుగు హీరోలు నితిన్ - నిఖిల్ లు లాక్ డౌన్ కరోనాతో పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. చాలామంది అలానే చేశారు. కానీ కన్నడ హీరో నిఖిల్ గౌడ మాత్రం ససేమిరా అన్నారు. రేవతిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది బంధువులు - కుటుంబ సభ్యుల మధ్య రేవతి మెడలో మూడు ముళ్లు వేశాడు నిఖిల్ . నిశ్చిత్తార్థం వేడుక అంగరంగ వైభవంగా జరగగా.. పెళ్లిని కూడా అదిరిపోయేలా ప్లాన్ చేశారు. కానీ కరోనాతో పెళ్లిని వాయిదా వేయడం కంటే సింపుల్ గా చేయడం బెటర్ అని ఇలా బెంగళూరులోని ఫాంహౌస్ లో ఉదయం 7.30గంటలకు వివాహాన్ని సాదాసీదాగా పూర్తి చేశారు.
నిఖిల్ జాగ్వార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మొన్నటి ఎన్నికల్లో నిఖిల్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు. హీరోగా - జేడీఎస్ రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి