యంగ్ హీరో నిఖిల్ వరుస సక్సెస్ లతో జోష్ మీద ఉన్నపుడు శంకరాభరణం దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. స్వామి రారా.. కార్తికేయ.. సూర్య వర్సెస్ సూర్య అంటూ.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వరుసగా సినిమాలను సక్సెస్ చేస్తున్న నిఖిల్ కి.. కోన వెంకట్ అన్నీ తానే అయ్యి తీసిన శంకరాభరణం పెద్ద షాక్ నే ఇచ్చింది. దీన్నుంచి కోలుకుని.. బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుని.. నెక్ట్స్ మూవీని థియేటర్లలోకి తెచ్చేసరికి ఏడాది పట్టింది ఈ హీరోకి.
ఇప్పుడు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. సోలో రిలీజ్ కి అవకాశం చిక్కడంతో ప్రమోషన్స్ భారీ లెవెల్లోనే చేస్తున్న నిఖిల్.. శంకరాభరణం నాటికి పాత చేదు జ్ఞాపకాల గురించి పంచుకుని.. పాఠాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. 'శంకరాభరణం రిజల్ట్ చూసి చాలా నిరుత్సాహపడ్డాను. ఓ ప్రాజెక్టుకు సైన్ చేసేటప్పుడు ఎవరి ఒత్తిడికి లొంగకూడదనే పాఠం నేర్పింది ఆ సినిమా' అంటున్నాడు నిఖిల్. ఆ మూవీకి ఆల్ ఇన్ వన్ గా వ్యవహరించింది కోన వెంకటే కాబట్టి.. ఆ పేరు చెప్పకుండా.. ఇలా ఇన్ డైరెక్టుగా నిఖిల్ చెబుతున్నాడని అంటున్నారు సినీ జనాలు.
ఇక ప్రస్తుతం నెలకొన్న కరెన్సీ సమస్యతో జనాలు థియేటర్లకు వస్తారా అనే డౌట్స్ ఇండస్ట్రీలో ఉన్నా.. తన సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'కు ఆదరణ దక్కుతుందని కాన్ఫిడెంట్ గానే ఉన్న నిఖిల్.. మూవీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చెయ్యలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/