టాలీవుడ్ లో మొలిచిన చెట్టుకి - పుట్టకి కూడా ఈగోలుంటాయ్! ఒకరి ఈగోని శాటిస్ ఫై చేయడం కోసం మిగతావాళ్లు ఈగోలు చంపుకోవాల్సిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి అనారోగ్యకర వాతావరణం ఉంటుందిక్కడ. అయితే ఈ ఈగోల గోల ఇటీవలి కాలంలో కాసింత తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు కొందరు అనుభవజ్ఞులు. ఈగోలతో సాధించేది ఏమీ లేదు అని అర్థం చేసుకున్న కొందరు యంగ్ హీరోలు స్నేహసుహృద్భావ వాతావరణంలో పనిచేసుకునేందుకు ముందుకొస్తున్నారు.
ఇటీవలి కాలంలో యువహీరోలంతా ఓ చోట మీటింగులు, పార్టీలు పెట్టుకుని అలాంటి వాతావరణం నుంచి బైటపడుతున్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే ఈగో గురించి హ్యాట్రిక్ విజయాల హీరో నిఖిల్ ఓ మాట చెప్పాడు. కోన వెంకట్ వంటి స్టార్ రైటర్ నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అతడు హీరోల ఇమేజ్ కి తగ్గట్టు వారిని ఊహించుకుని కథలు రాస్తుంటారు. అయితే శంకరాభరణం కథ అలా రాసుకున్నది కాదు. ఇదో డిఫరెంట్ స్టోరీ. కథకు సరిపడే నటీనటుల్ని ఎంపిక చేసుకునేందుకే ప్రాముఖ్యతనిచ్చారు. నన్ను హీరోగా ఎంపిక చేసుకోవడం ఆనందాన్నిచ్చింది. మేం ఈగోల్లేకుండా పనిచేసుకుపోయాం. మంచి ఔట్ పుట్ వచ్చింది. భీహార్ - ఉత్తరప్రదేశ్ లాంటి చోట షూటింగులు చేశాం. .. అని నికిల్ చెప్పుకొచ్చాడు.
మంచిదే.. అందరూ నీలా ఆలోచించాలి గురూ! ఈగోలు వదిలి కలిసి ఉంటేనే కలదు సుఖం.