బ్రాహ్మిన్ నిఖిల్ కి అరుదైన గుండె జబ్బు

Update: 2017-04-09 05:30 GMT
ఈ సారి సమ్మర్ కి షెడ్యూల్ కి షెడ్యూల్ అయిన సినిమాలన్నీ క్రేజీ ప్రాజెక్టులే. సమ్మర్ సినిమాల కౌంట్ తక్కువగానే ఉన్నా.. ఆసక్తి మాత్రం ఎక్కుగానే కనిపిస్తోంది. వీటిలో నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన కేశవ కూడా ఒకటి. హ్యాపీడేస్ ఫేమ్ అని చెప్పాల్సిన అవసరం లేనంత గుర్తింపు సంపాదించుకున్న నిఖిల్.. ప్రతీమూవీతోనూ తన స్థాయి పెంచుకుంటూనే ఉన్నాడు.

వేసవిలో విడుదల కానున్న కేశవ చిత్రం ఇప్పటికే విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుండగా.. ఈ మూవీలో అన్నిటికంటే స్పెషల్ నిఖిల్ కేరక్టర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నిఖిల్ ఓ బ్రాహ్మిన్ పాత్ర పోషిస్తున్నాడనే విషయం ఇప్పటికే టీజర్ ద్వారా చెప్పేశారు. అయితే.. ఈ రోల్ కి ఓ అరుదైన గుండె జబ్బు ఉంటుందట. కుడి వైపు గుండె ఉండే ఈ పాత్రకు.. డెక్స్ ట్రోకార్డిలా అనే ఈ వ్యాధి ఉంటుంది. దీంతో నిమిషానికి 90 సార్లు గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఏ మాత్రం తగ్గినా ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పగ తీర్చుకునే పాత్రే కేశవ.

నిఖిల్ కి విలన్స్ తో కంటే.. తన ఆరోగ్య పరిస్థితితోనే ఎక్కువగా పోరాడాల్సి వస్తుందట. ఈ మూవీకి అదే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ కేశవలో హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇషా కొప్పికర్ ఓ ప్రధాన పాత్రను పోషిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News