లాక్ డౌన్ వల్ల ఘనమైన ప్లానింగ్స్ ని పక్కన పెట్టి సింపుల్ గానే పెళ్లి వేడుకను కానిచ్చేయాల్సి వస్తోంది. అందుకు సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా ఏం లేదు. ఇటీవల టాలీవుడ్ లో రెండు వరుస పెళ్లిళ్ల తీరు ఇలానే ఉంది. అందులో నిఖిల్ పెళ్లి వేడుక ఎంతో సింపుల్ గా 32 మంది బంధుమిత్రులు అతిథుల మధ్య జరిగింది. తాను ప్రేమించిన డా.పల్లవిని నిఖిల్ పెళ్లాడేశాడు. ఇంతకుముందు ఈ జంట ఫోటోలు రిలీజై అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లి వీడియో రిలీజైంది.
ఈ వీడియో ఎంతో బ్యూటిఫుల్ గా డిజైనర్ స్టైల్లో ఆకట్టుకుంది. నిఖిల్ కళ్యాణ మంటపంలో అడుగుపెట్టడం అటుపై పెళ్లి కూతురు సిగ్గుపడడం.. మూడు ముళ్లు వేసే తంతు ప్రతిదీ ఎంతో బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. నిఖిల్ పెళ్లిలో కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి సందడి మామూలుగా లేదు. తన స్నేహితులు.. సహచరులు అభిమానుల ఆశీర్వాదాలను స్వీకరించడానికి ఈ వీడియోని షేర్ చేశాడు నిఖిల్. కరోనా లాక్ డౌన్ వల్లనే ఎక్కువ మందిని ఈ వేడుకకు ఆహ్వానించలేదని చెప్పకనే చెప్పాడు.
నిఖిల్ సంప్రదాయ వివాహ వేడుక వీడియో ఎంతో మనోహరంగా ఉంది. వీడియో నేపథ్యంలో `మనసా మల్లి మల్లి చుసా` గీతం ఎంతో అద్భుతంగా కుదిరింది. #NIKPAL అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు ఇప్పటికే ఈ వీడియోని అంతర్జాలంలో వైరల్ చేసేస్తున్నారు. నిఖిల్ - పల్లవి వర్మ నిజంగా ఒకరికోసం ఒకరు పుట్టారా? అన్నట్టుగా ఎంత బాగా జత కుదిరారు అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. పెళ్లితో ఓ ఇంటివాడయ్యాడు. ఇక కెరీర్ ని మరో లెవల్ కి తీసుకెళ్లడమే ధ్యేయంగా అతడి ప్రణాళికలు సాగనున్నాయి. ఈ లాక్ డౌన్ లోనే హనీమూన్ ముగించేస్తే తదుపరి బిజీ షెడ్యూల్స్ తో కుస్తీలు పట్టాల్సి ఉంటుంది. కార్తికేయ సీక్వెల్ తో పాటు 18 పేజెస్ అనే చిత్రంలోనూ నిఖిల్ నటిస్తున్నాడు.
Full View