ప్రేమకు కులం లేదు.. ప్రాంతం లేదు.. జాతి లేదు.. మతం లేదు. ప్రేమ భావనను అందరూ అనూభితించవచ్చు. ప్రేమలో మునిగి తేలే హక్కు అందరికీ ఉంటుంది. సరిగ్గా ఇదే సెన్సిటివ్ పాయింట్ మీదే ఒక క్యూట్ లవ్ స్టోరీగా ముస్తాబై మన ముందుకు వస్తోంది ‘నిర్మలా కాన్వెంట్’. ప్రముఖ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఈ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. బాలనటిగా పరిచయమైన శ్రేయా శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఒక ప్రముఖ పాత్రలో కింగ్ నాగార్జున నటిస్తూ ఉండటం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. ఇదొక్కటేకాదు.. ఈ చిత్రానికి ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి.
ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు రోషన్ సాలూరు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు ఈయన. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రహమాన్ కుమారుడు ఎ.ఆర్.అమీన్ గాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. అంతేకాదు, ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ కుమారుడు సిద్ధార్థ్ మహాదేవన్ కూడా ఒక పాట ప్రెజెంట్ చేస్తున్నాడు! అన్నిటికీ మించిన మరో ప్రత్యేకత... 17 సంవత్సరాల తరువాత కింగ్ నాగార్జున ఈ చిత్రం కోసం పాట పాడటం! ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు నాగ కోటేశ్వరరావు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగ్ ఆడిపాడిన పాట ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఇక, ఓవర్ సీస్ లో కూడా నిర్మలా కాన్వెంట్ పై బాగానే క్రేజ్ పెరిగిందని తెలుస్తోంది. లక్ష్మీనారాయణ మూవీస్, కౌశిక్ రెడ్డిలు సంయక్తంగాఈ చిత్ర వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకున్నారు. అమెరికాలో రోలింగ్ రీల్ ఎంటర్‌టెయిన్మెంట్స్, ఈ-బాక్స్ తెలుగు టీవీ (అమెరికాలోని తొలి తెలుగు లోకల్ టీవీ)తో కలసి విడుదల చేయబోతున్నారు. ఒక క్యూట్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16న విడుదలకు సిద్ధమౌతోంది నిర్మలా కాన్వెంట్.