త్రివిక్రమ్ ను లైన్లో పెట్టే పనిలో నితిన్?
అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా కథలను తయారు చేసుకోవడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. కథ .. స్క్రీన్ .. మాటలు .. వీటిని ఆయన చాలా తాపీగా సమకూర్చుకుంటాడు. ఆలస్యమవుతుందని ఆయనను ఎవరూ తొందరపెట్టేవారు లేరు. దాదాపు తనకి హోమ్ బ్యానర్ లాంటిదే అయిన 'హారిక అండ్ హాసిని' క్రియేషన్స్ పైనే ఆయన సినిమాలను రూపొందిస్తుంటాడు. అందువల్లనే కూల్ గా తనకి కావలసిన ఆర్టిస్టులు .. ఇతర సాంకేతిక నిపుణులు దొరికేవరకూ ఆయన వెయిట్ చేస్తాడు. ముహూర్తపు రోజున ఆయన ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో .. హిట్ టాక్ వచ్చేవరకూ అంతే కూల్ గా కనిపిస్తాడు. క్రియేటివిటీని ఆయన కాపాడుకునే సీక్రెట్ ఇదే.
అలాంటి త్రివిక్రమ్ కెరియర్లో ఎక్కువగా సక్సెస్ లే కనిపిస్తాయి. అందువలన స్టార్ హీరోలు ఆయనతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. ఆయనపై గల నమ్మకంతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆయన దర్శకత్వంలో మహేశ్ బాబు రెండు సినిమాలు, పవన్ ... బన్నీ మూడేసి సినిమాలు చేయడానికి కారణం ఇదే. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'అరవింద సమేత' తరువాత వాళ్ల కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'ఉగాది' రోజున ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఈ నేపథ్యంలో నితిన్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేసిన 'అ ఆ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నితిన్ చేసిన 'ఛల్ మోహన్ రంగ' సినిమాకి త్రివిక్రమ్ కథను అందించడమే కాకుండా, ఒక నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నితిన్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడని అంటున్నారు. ఒకవేళ ఈ టాక్ నిజమే అయితే, త్రివిక్రమ్ కమిట్మెంట్స్ ను బట్టి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఆధారపడి ఉంటుందని అనుకోవాలి.