యంగ్ హీరో నితిన్ చాలా అంచనాలు పెట్టుకుని చేసిన 'శ్రీనివాస కళ్యాణం' చిత్రం తీవ్ర నిరాశ పర్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా సమయంలోనే 'ఛలో' చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' చిత్రం చేయబోతున్నట్లుగా నితిన్ వెళ్లడించాడు. వీరిద్దరి కాంబోలో మూవీ కొన్ని నెలల క్రితమే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా ఏవో కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తోంది. సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలోనే కొందరు మోసగాళ్లు 'భీష్మ' సినిమాలో ఆఫర్ అంటూ ఒక వాట్సప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'భీష్మ' సినిమా కోసం కాస్టింగ్ కాల్ అంటూ వాట్సప్ గ్రూప్ క్రియేట్ అయ్యింది. ఆ వాట్సప్ గ్రూప్ లో చాలా మంది యాడ్ అయ్యారు. ఈ చిత్రంలో పాత్ర కావాలంటే మూడు లక్షలు ఇవ్వండి అంటూ ఆ వాట్సప్ గ్రూప్ లో కొందరు మెసేజ్ లు పెట్టడం ప్రారంభించారు. కొందరు ఇప్పటికే ఈ ప్రకటన చూసి మోసపోయి డబ్బులు కూడా చెల్లించారట. ఇదే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు మేలుకున్నారు.
వెంకీ కుడుముల స్పందిస్తూ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఏమీ ఇవ్వలేదని - ఆ వాట్సప్ గ్రూప్ కు చిత్ర యూనిట్ సభ్యులకు సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక షూటింగ్ ప్రారంభం అయ్యి, ఒక భారీ యాక్షన్ సీన్ కూడా తెరకెక్కించినట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. వార్తలను అయితే కొట్టి పారేశాడు కాని సినిమా ఎప్పుడు ఆరంభించేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ముందు ముందు మరెన్ని పుకార్లు వినాల్సి వస్తుందో..!