కరోనా ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. కరోనా బారినుండి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ పేరుతో ఈ నెల 31వరకు లాక్ డౌన్ విధించాయి. సామాన్య ప్రజలు - సెలెబ్రిటీలు అంతా కూడా ఎవరి ఇళ్లకు వారు అంకితమయ్యారు. ఈ సమయంలో హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకు సీఎం ఫండ్ కింద కరోనా బాధితుల వైద్య సహాయానికి చెరో 10లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ప్రకటించిన విధంగానే ఈ రోజు తెలంగాణ సీఎం కెసిఆర్ ను కలిసి కరోనా బాధితుల సహాయార్థం 10లక్షల చెక్కును సీఎం చేతికి అందించడం జరిగింది.
ఈ సందర్బంగా హీరో నితిన్ ను కెసిఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని తన సేవా దృక్పథానికి అభినందనలు తెలియజేసారు. అనంతరం హీరో నితిన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నిరోధక చర్యల విషయంలో సీఎం కెసిఆర్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. సీఎం కెసిఆర్ స్పూర్తితో తెలంగాణ ప్రజలంతా కూడా లాక్ డౌన్ కి సహకరించి కరోనా నుండి విముక్తి పొందాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తాను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని త్వరలోనే కలిసి 10లక్షల చెక్కును ప్రకటించిన విధంగా అందజేస్తానని తెలియజేసాడు.