అఖిల్ వదిలేసిన సినిమా నితిన్ చేతిలో?

Update: 2016-08-11 08:55 GMT
దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చింది. అందుకే స్వయంగా అఖిల్ ఈ సినిమాను చేస్తున్నానంటూ ప్రకటించాడు. ఇంతలో ఏమొచ్చిందో.. ఈ సినిమా ఆగిపోయిందంటూ రూమర్లు వచ్చాయి. అఖిల్ డేట్స్ వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉండటం.. అలాగే హను మాత్రం 14 రీల్స్ వారికి ఒక సినిమా చేయాల్సి రావడం.. ఇద్దరి ప్రొడ్యూసర్ల మధ్యన సయోధ్య కుదరకపోవడంతో.. సినిమాను కాల్ ఆఫ్‌ చేశారని టాక్‌.

కట్ చేస్తే.. ఇప్పుడు ఇదే సినిమాను హీరో నితిన్ చేస్తున్నాడా? అంటే.. అవుననే అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. హను రాఘవపూడి ఓ రెండు రోజుల క్రితం  ఈ సినిమా కథను నితిన్‌ కు నెరేట్ చేశాడట. అంతే కాదు.. అసలు నితిన్ కు ఈ కథ చెప్పమని పంపిందే అఖిల్. మీకు తెలుసుగా.. అఖిల్ డెబ్యూ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. మన నితినే. అయితే కథ విన్న నితిన్ ఈ సినిమాను తన బ్యానర్లో తానే ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నా కూడా.. 14 రీల్స్ ఎంటర్టయిన్మెంట్ వారు ఇచ్చిన టెంప్టింగ్ రెమ్యూనరేషన్ ఆఫర్ తో ఇప్పుడు వాళ్ళ బేనర్ లో చేయడానికి సిద్దపడ్డాడట.

గతంలో ఇలా ఒక హీరో నుండి ఇంకో హీరో చేతులు మారిని సబ్జెక్టులు చాలావరకు హిట్లు కొట్టాయి. పైగా నితిన్ అంటేనే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఒక హ్యాండ్సమ్ స్టార్. కాబట్టి హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాధ తరువాత చేయబోయే ఈ సినిమాతో ఖచ్చితంగా మెగా హిట్టు పడుతుందనే అందరి అంచనా. సర్లేండి.. ముందు సినిమాను అఫీషియల్ గా ప్రకటించనివ్వండి.
Tags:    

Similar News