టాలీవుడ్ లో ట్రెండ్ అంత ఈజీగా అర్థం చేసుకునేది కాదు. ఏ టైం లో ఏ సినిమా ఆడుతుందో ఏది పోతుందో చెప్పగలిగే విశ్లేషణాత్మక నైపుణ్యం ఇప్పుడున్న పరిశ్రమ పెద్దలకు కూడా వంటబట్టడం లేదు. అందుకే ప్రేక్షకుల అభిరుచిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళను అలరించేలా సినిమాలు తీయడం పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. ఫ్యామిలీ నో లేక యూత్ అనో ఒక జానర్ కు కట్టుబడి సినిమా తీసినంత మాత్రం వాళ్లంతా ఎగబడి వస్తారన్న గ్యారెంటీ ఏమి లేదు. నిర్మాత హీరో ఎవరు అనే పట్టింపు ఆధునిక ప్రేక్షకుడికి లేదు. అందుకే మొన్నొచ్చిన రెండు కోట్ల బడ్జెట్ సినిమాకు ఏకంగా పది కోట్ల షేర్ వచ్చేసింది. దిల్ రాజు నిర్మాతగా నితిన్ హీరోగా రూపొందుతున్న శ్రీనివాస కళ్యాణం హడావిడి గత రెండు వారాలుగా జరుగుతూనే ఉంది. ఆడియో విడుదల తర్వాత మేకింగ్ వీడియో అంటూ సెట్ లో క్లిప్పింగ్స్ తో ఈ మధ్యే ఓ బిట్ ను యు ట్యూబ్ లో వదిలారు. కంప్లీట్ ఫామిలీ ఎంటర్ టైనర్ అనే యాంగిల్ లో దీన్ని ప్రొజెక్ట్ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కొన్ని అనుమానాలు రాకమానవు.
గత కొన్నేళ్లుగా పోకడను గమనిస్తే పెళ్లి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలు అంతగా వర్క్ అవుట్ కాలేదని ఋజువవుతూనే ఉంది. ఎక్కడిదాకో కాదు మొన్న వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ ఫలితం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. శ్రీనివాస కళ్యాణం గురించి అచ్చ తెలుగు పెళ్లి ఎలా ఉంటుందో చూపించబోతున్నాం అని పదే పదే చెబుతున్న దిల్ రాజు టీమ్ గతంలో వచ్చిన అల్లు అర్జున్ వరుడు తరహాలోనే చెప్పుకోవడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. వరుడు టైంలో ఐదు రోజుల పెళ్లి ఇందులో అద్భుతంగా చూపించబోతున్నాం అని పదే పదే చెప్పుకున్న గుణ శేఖర్ ఎంత దారుణమైన అవుట్ ఫుట్ ఇచ్చాడో బన్నీ ఫాన్స్ మర్చిపోలేదు. పెళ్లి ఎలా చూపించారు అనే దాని కన్నా అందులో ఎంత డ్రామా పండించారు అనే దాని మీదే ఇలాంటి సినిమాల సక్సెస్ ఆధారపడి ఉంది.
హీరో నితిన్ హ్యాట్రిక్ డేంజర్ లో ఉన్నాడు. గత ఏడాది చేసిన లై-ఈ సంవత్సరం వచ్చిన చల్ మోహనరంగా ఫెయిల్ అయ్యాయి. శ్రీనివాస కళ్యాణం హిట్ కావడం చాలా అవసరం. మరి నెగటివ్ సెంటిమెంట్ అల్లుకున్న ఈ పెళ్లి సినిమాను పేక్షకులు ఆదరించాలి అంటే పెళ్లి తంతును చూపిస్తే సరిపోదు. ఆ మాత్రం ఘట్టాలు మా ఇంట్లో పెళ్లి డివిడిలలో లేవా అనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా కట్టిపడేసే మెలోడ్రామాతో పాటు ఎమోషన్స్ ని అద్భుతంగా చూపిస్తేనే తప్ప ఊరికే పెళ్లి తతంగంతో సినిమాలు ఆడే రోజులు కావివి. ఈ క్యాటగిరీలో బెంచ్ మార్క్ గా మిగిలిన పెళ్లి సందడి-ప్రేమాలయం లాంటి సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పటిదాకా చూపించిన ప్రమోషన్ లో శ్రీనివాస కళ్యాణం పెళ్లి హడావిడి తప్ప ఎగ్జైట్ చేసే మ్యాటర్ అయితే కనిపించడం లేదు. మరి వీటికి ఎదురీది శ్రీనివాస కళ్యాణం బాక్స్ ఆఫీస్ బరిలో గెలుస్తాడా లేదా వేచి చూడాలి.