జ్యోతిక వద్దంది.. నిత్య కళ్లకద్దుకుంది

Update: 2017-02-07 05:32 GMT
పెళ్లి తర్వాతే ఆరేడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఏడాది కిందటే రీఎంట్రీ ఇచ్చింది. ‘36 వయదినిలే’ అనే సినిమా చేసింది. ఇప్పుడు ‘మగలిర్ మట్టుం’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఐతే ఆమెకు అనుకోకుండా ఒక భారీ కమర్షియల్ సినిమా ఛాన్స్ వచ్చింది. ఒకప్పుడు ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్లో జత కట్టిన విజయ్ తో మళ్లీ నటించే ఛాన్స్ దక్కింది. కానీ ఆ అవకాశాన్ని వద్దనుకుంది జ్యోతిక. కారణాలేంటో తెలియదు కానీ.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు నో చెప్పింది సూర్య సతీమణి. ఐతే జ్యోతిక నో అనడంతో అట్లీ అండ్ కో హర్టయినట్లున్నారు. ఆమె కాదన్న ఒక్క రోజులోనే రీప్లేస్మెంట్ రెడీ చేసేశారు.

జ్యోతిక కాదన్న రోల్ ను మలయాళ కుట్టి నిత్య మీనన్ ఓకే చేసింది. ఎప్పుడూ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసే నిత్య.. స్టార్ హీరోలతో అనగానే అలాంటి కండిషన్లేమీ పెట్టట్లేదు. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి.. జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే చేసింది. మరి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా భావిస్తున్న విజయ్ సినిమాలో ఆమె పాత్ర ఎలాంటిదో చూడాలి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్.. సమంత కూడా నటిస్తున్న నేపథ్యంలో నిత్య ఎలా తన ప్రాధాన్యాన్ని నిలుపుకుంటుందో చూడాలి. విజయ్ తో సినిమా అనగానే ఆమె మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేసిందట. ఈ చిత్రానికి మన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయడం విశేషం. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించనున్నాడు.
Tags:    

Similar News