‘లింగ’ దెబ్బకు జనాలే కాదు.. డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కూడా బెంబేలెత్తిపోయాడు. ‘లింగ’ విడుదలైన వెంటనే కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తో సినిమా మొదలుపెట్టాల్సింది కానీ.. జనాలు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది రవికుమార్ కి. స్క్రిప్టు విషయంలోనూ ఇంకో రౌండు కూర్చోక తప్పలేదు. మొత్తానికి లింగ విడుదలైన ఎనిమిది నెలల తర్వాత తన తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి ముహూర్తం చూసుకున్నాడు కె.ఎస్. ఈ నెల 10న సుదీప్-కె.ఎస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు నిత్య మీనన్ ను హీరోయిన్ గా ఎంచుకోవడం విశేషం.
నిత్య ఇప్పటికే నాలుగైదు కన్నడ సినిమాల్లో నటించింది. ఐతే చాలా గ్యాప్ తర్వాత అక్కడ సినిమా చేయబోతోంది. 90ల్ల్లో విష్ణువర్ధన్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘కోటిగొబ్బ’కు ఈ సినిమా సీక్వెల్ కావడం విశేషం. రజినీకాంత్ సినిమా ‘బాషా’ ఇన్ స్పిరేషన్ తో తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీయాలని భావించాడు సుదీప్. కె.ఎస్.తో కలిసి స్క్రిప్టు రెడీ చేశాడు. ఈ సినిమాను కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ కె.ఎస్, నిత్య, సుదీప్ మూడు ఇండస్ట్రీలకు పరిచయం ఉన్నవారే కాబట్టి మూడు భాషల్లో రిలీజ్ చేయడానికి పెద్దగా ఇబ్బందులుండవు.