సావిత్రి మిస్సయినా జయలలిత దక్కింది

Update: 2018-09-23 15:48 GMT
ఈ ఏడాది వేసవిలో విడుదలైన ‘మహానటి’ దక్షిణాదిన బయోపిక్స్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో మరిన్ని బయోపిక్స్‌ తెరకెక్కేందుకు ఊపు తెచ్చింది. ఈ కోవలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కూడా తెరమీదికి వచ్చింది. ఆమె మీద ఒకటికి మూడు సినిమాలకు సన్నాహాలు జరుగుతుండటం విశేషం. అందులో ఒకటి ఇటీవలే మొదలైంది. ప్రియదర్శిని అనే లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ‘ది ఐరెన్ లేడీ’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు మురుగదాస్ లాంచ్ చేశాడు

ఈ చిత్రంలో కథానాయిక కూడా ఖరారైంది. ఈ తరంలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్ ‘ది ఐరెన్ లేడీ’లో జయలలిత పాత్ర పోషించనుంది. ఈ విషయాన్ని తమిళ మీడియా ధ్రువీకరించింది. కొంత కాలంగా నిత్య బాగా లావెక్కి కనిపిస్తోంది. ‘గీత గోవిందం’లో మరీ ఎబ్బెట్టుగా కనిపించి షాకిచ్చింది. ఐతే జయలలిత పాత్ర చేయాల్సి ఉండటంతో ఆమె ప్రస్తుత లుక్ పర్ఫెక్టుగా సూటయ్యే అవకాశముంది. నిత్య నిజానికి ‘మహానటి’లో సావిత్రిగా కనిపించాల్సింది. కానీ ఆ సినిమా అనుకోకుండా మిస్సయింది. ఐతేనేం జయలలితగా నటించబోతుండటం ప్రత్యేకమే. ఈ సినిమా సంగతలా ఉంచితే.. స్టార్ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్‌తో విష్ణు ఇందూరి జయలలిత బయోపిక్ అనౌన్స్ చేశాడు. లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా సైతం జయలలిత బయోపిక్ తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు. ఆయన కూడా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఇవి రెండూ త్వరలోనే ఆరంభం కానున్నాయి.
Tags:    

Similar News