ఇప్పుడు హీరో నితిన్ తీసుకున్న నిర్ణయం కాస్త షాకింగ్ గానే ఉంది. ఎందుకంటే తన సినిమాను రిలీజ్ చేస్తాడు అనుకున్న తేదీని.. ఇప్పుడు వేరే హీరో కోసం దారాదత్తం చేస్తున్నాడు. అయితే ఆ సినిమా కూడా వీళ్లదేలే.
మ్యాటర్ ఏంటంటే.. నితిన్ ''అ..ఆ'' సినిమాను ఎలాగైనా సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ఎప్పటినుండో అనుకుంటున్నాడు. అయితే గతంలో బ్రహ్మోత్సవం సినిమా మే 24న అని అనుకున్నారు కాబట్టి.. మే 6న ఈ త్రివిక్రమ్ సినిమాను రంగంలోకి దించాలని నితిన్ బాబు ప్లాన్. కాని ఇప్పుడు బ్రహ్మోత్సవం గ్యాప్ ఇవ్వకుండా మే 13న వస్తోంది కాబట్టి.. నితిన్ కు మాంచి డేట్ దొరికే ఛాన్సులుంది. అందుకే తన సినిమాను పక్కనెట్టేసి.. మే 6న ఇప్పుడు సూర్య ''24'' సినిమాను రిలీజ్ చేయాలని ఈ కుర్ర హీరో ఫిక్సయిపోయాడు.
సూర్య తో 24 సినిమాను తీసింది తన ఇష్క్ డైరక్టర్ విజయ్ కె కుమార్ కాబట్టి.. ఆ సినిమా తెలుగు రైట్స్ ను మనోడే కొనుకున్నాడు. అయితే ఇంత మంచి సమ్మర్ సీజన్ లో నితిన్ బాబు తన సొంత సినిమాను పక్కనెట్టేసి ఈ రీమేక్ సినిమానే ఎందుకు రిలీజ్ చేస్తున్నట్లో. ఒకవేళ 24 బెటర్ అనుకున్నాడేమో.