విక్రమ్-ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ .. ఇటీవలి కాలంలో కోలీవుడ్ మీడియాలో విపరీతంగా నలిగిపోయింది. నేడు ప్రారంభం, రేపు ప్రారంభం అంటూ ఊకదంచేసింది. అంతేనా పవన్ కల్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ లా కాస్టింగ్ లోనూ బోలెడన్ని మార్పులు. ఇప్పటికే కాజల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కుదరలేదు. బిందుమాధవిని ఎప్రోచ్ అయ్యారు. అది కూడా పోయిందిప్పుడు. ఏకంగా ప్రొడక్షన్ హౌసే మారిపోయింది.
కొత్త సంస్థ ఈ ప్రాజెక్టుని టేకోవర్ చేసింది. దీంతో మళ్లీ కాస్టింగ్ పరమైన మార్పు చేర్పులొచ్చాయి. కాజల్ - బిందుమాధవి ప్లేస్ లో ఇప్పుడు రింగుల జుత్తు సుందరి నిత్యామీనన్ పేరు వినిపిస్తోంది. ఈ అమ్మడితో ఇప్పటికే ప్రాజెక్టుకు కమిటయ్యారుట. నిత్యా ఇటీవలి కాలంలో వరుస విజయాలు అందుకుంటున్నా ఎందుకనో వెంట వెంటనే సినిమాలు చేయడం లేదు. తెలుగులో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - ఒకే బంగారం సినిమాలతో హిట్స్ అందుకుంది. ఒకేబంగారం తమిళ వెర్షన్ ఓకే కన్మణితోనూ విజయం అందుకుంది. కానీ ఎందుకనో ఆ తర్వాత వేరే ప్రాజెక్టులకు కమిటైంది లేదు. మరోవైపు మాతృపరిశ్రమ మలయాళంపైనా దృష్టి సారించి ఇతర పరిశ్రమలకు కాసింత దూరమైంది. మళ్లీ ఈ సినిమాతో తెలుగు - తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట.
ఇకపోతే ఈ సినిమా కోసం విక్రమ్ సరసన మెయిన్ హీరోయిన్ గా నటించడానికి నయనతార ఏకంగా 3 కోట్లు తీసుకుంటోంది. ఫ్లాపులతో కొట్టుమిట్టాడతున్న విక్రమ్ సరసన నటించడానికి ఈ భామలందరూ అలా భారీగా ఛార్జ్ చేస్తున్నారు మరి.