`మెంటల్ మదిలో` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన తమిళ నటి నివేద పెథురాజ్. తొలి సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా అవకాలకు కొదవేం లేదు. ప్రస్తుతం తెలుగు- తమిళ భాషల్లో చేతినిండా సినిమాలున్నాయి. అల వైకుంఠపురములో- రెడ్ లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అటు తమిళ్ లో మూడు సినిమాలు చేస్తోంది. దాదాపు అన్ని సినిమాలు వచ్చే ఏడాది ఒకేసారి రిలీజ్ కానున్నాయి. ఇక సోషల్ మీడియలో అమ్మడు ఎప్పటికప్పుడు నెటిజనులకు టచ్ లో ఉంటుంది. సమయం చిక్కినప్పుడు వాళ్లతో చిట్ చాట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులకు-నివేదకు మధ్య జరిగిన సంభాషణల్లో నీవేదా తన చిన్నప్పటి చీకటి ఆటల గురించి చెప్పి మురిసిపోయింది. ఓ అభిమాని రాత్రి వేళ కరెంట్ పోయినప్పుడు ఏం చేసేవారని ప్రశ్నించగా? చుట్టు పక్కన ఉండే పిల్లలతో కలిసి కథలు చెప్పుకోవడం.. ఆటలాడుకోవడం వంటింది చేసేదిట. అప్పుడప్పుడు ముఖానికి టార్చ్ లైట్ వేసి భయపెట్టేదాన్ని అని తెలిపింది. ఇక స్కూల్లో టీచర్ చాక్ పీస్ లు కొట్టేసేదట. వాటిని ఇంటికి తీసుకెళ్లి వాళ్లమ్మకిచ్చి ముగ్గులు పెట్టమని చెప్పేదట. ఇప్పటి జీవితంతో పొలిస్తే చిన్న ప్పటి జీవితం ఎంతో గొప్పది. మధురమైనది. ఆ రోజులు మళ్లీ రావంటూ చెప్పుకొచ్చింది.
ప్రతి ఒక్కరికి బాల్యం అనేది మెమరబుల్ గా ఉంటుంది. పెద్దయ్యాక అలాంటి జ్ఞాపకాల్నే రివైండ్ చేసుకుని బతికేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కెరీర్ ఉద్యోగం కుటుంబ సమస్యలు అంటూ తల బొప్పి కట్టేస్తుంది కాబట్టి రిలీఫ్ కోసం చిన్నప్పటి సంగతుల్ని గుర్తు చేసుకోవాలని అంది.