రెండు రోజుల్లో విడుదల కానున్న నాని మూవీ జెంటిల్మన్ తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది నివేదా థామస్. ఇప్పుడు కుర్ర హీరోయిన్ల స్పీడ్ తో కంపేర్ చేస్తే.. ఈ చిన్నది కాసింత లేట్ గానే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని చెప్పచ్చు. ఏడెనిమిదేళ్లుక మలయాళ - తమిళ సినిమాలు చేస్తున్న నివేద.. నాని మూవీతో తెలుగులోకి రావడం తన అదృష్టం అనేస్తోంది.
'జెంటిల్మన్ లో నేను కేథరిన్ అనే వీఎఫ్ఎక్స్ డిజైనర్ పాత్ర పోషిస్తున్నాను. ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే మోడర్న్ గళ్ పాత్ర ఇది. చాలా రొమాంటిక్ ఫీల్ ఉన్న పర్సన్ అయినా.. అంత త్వరగా బయటపడే రకం కాదు'అంటూ తన కేరక్టర్ గురించి ఎక్స్ ప్లెయిన్ చేసింది ఈ తమిళ సుందరి. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన పాత్ర ఏంటో ఎలా ఉంటుందో చెప్పిన తర్వాత.. ఆ రకంగా మేకోవర్ అయ్యేందుకు రెండు నెలల పాటు కష్టపడ్డానని నివేద చెప్పింది.
ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నానని.. అవతలి వాళ్లు మరీ స్పీడ్ గా కాకుండా స్లోగా మాట్లాడితే బాగానే అర్ధమవుతుందని చెబుతోంది. ఇక జెంటిల్మన్ ఆఖరి రోజు షూటింగ్ జరుగుతున్నపుడయితే తెగ ఏడ్చేసిందట కూడా. సెట్ లో తనను అందరూ అంత బాగా చూసుకున్నారని.. ఇంట్లో ఉన్న ఫీల్ కలిగిందని నివేద అంటోంది. ఒప్పుకున్న పని పూర్తి చేసుకున్నట్లు కాకుండా.. ఇల్లొదిలి వెళ్లనని ఏడ్చే కేజీ క్లాసు పిల్లలా అయిపోయిందట నివేదా థామస్ పరిస్థితి. మరీ అంత అటాచ్మెంట్ అయితే కష్టం పాపా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.