జనతా గ్యారేజ్‌ లో కాంపిటీషన్ లేదు

Update: 2016-08-30 09:30 GMT
ఇప్పటివరకు అందరూ ''జనతా గ్యారేజ్‌'' సినిమాతో ఇతర సినిమాలేవైనా కాంపిటీట్ అవుతాయా అనే విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. కాకపోతే ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది. అదంతా చూస్తుంటే.. ఒకరికి ఒకరు చాలా కాంపిటీటివ్ అయిపోయే ఛాన్సుంది. ఇలాంటి విషయాల గురించి జనతా టీమ్ అయిన ఎన్టీఆర్.. కొరటాల శివ.. సమంత.. ఏమంటున్నారంటే..

''దొరికిన పాత్రలో పెర్ఫామ్ చేయడానికి బోలెడంత స్కోప్ ఉన్నప్పుడు.. ఇక ఒకరికి ఒకరు మధ్యన కాంపిటీషన్ ఏముంటుంది? మోహన్ లాల్ గారు కంప్లీట్ యాక్టర్ మాత్రమే కాదు.. కంప్లీట్ హ్యుమన్ బీయింగ్ కూడా. ఉన్నదాంట్లో తృప్తి పొందడంలో ఆయన చాలా హ్యాపీ మ్యాన్. అలాగే ఇతర యాక్టర్లందరూ కూడా.. ఎవరికివారు ఇరగదీశారు'' అన్నాడు ఎన్టీఆర్. ఇంతకీ సినిమాలో అసలు ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ క్యాస్టింగ్ ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు కొరటాల శివ సమాధానం చెప్పాడు. ''నేను కథ రాసేటప్పుడే ఇది ఎన్టీఆర్ కు అనుకున్నాను. అలాగే మోహన్ లాల్ పాత్రకు కూడా ఆయన్నే అనుకుని రాశాను. కొచిన్ వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఓకే చేశారు. అసలు ఈ రెండు క్యారక్టర్లకూ వేరే ఆల్టర్నేటివ్ అనుకోలేదు'' అంటున్నారు కొరటాల.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ టైములో.. ఎన్టీఆర్ మోహన్ లాల్ ను 'లాలెటన్' అని పిలిస్తే.. ఆయనేమో మనోడిని 'అన్నా' అని పిలిచేవారట. ఇదే నాకు అతి పెద్ద షాకింగ్ థింగ్ అంటున్నాడు కొరటాల. సెప్టెంబర్ 1న ''జనతా గ్యారేజ్'' సినిమా ధియేటర్లలోకి వస్తోంది.
Tags:    

Similar News