ఆదిపురుష్ ఫ్లాప్ తో ప్ర‌భాస్ కి వ‌చ్చిన ముప్పేమీ లేదు

Update: 2023-07-07 09:45 GMT
సాహో - రాధేశ్యామ్ - ఆదిపురుష్ .. ఇవ‌న్నీ భారీ అంచ‌నాల‌తో రిలీజై ఫ్లాప్ ల‌య్యాయి. కానీ వీటి ప్ర‌భావం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పై ప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. అత‌డు న‌టించిన సినిమా ఏదైనా రిలీజ్ కి వ‌స్తోంది అంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొంటోంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమాల విడుద‌ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు.

ఇప్పుడు ఇదే విష‌యాన్ని ప్రూవ్ చేస్తోంది స‌లార్. కేజీఎఫ్ తో సంచ‌ల‌నాలు సృష్టించిన ప్ర‌శాంతో నీల్ తో బాహుబ‌లి స్టార్ చేస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌లార్ పై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయే కానీ త‌ర‌గ‌డం లేద‌ని తాజా రికార్డులు వెల్ల‌డిస్తున్నాయి.

భారీ అంచనాల మధ్య గ్యాంగ్ స్టర్ డ్రామా స‌లార్ టీజర్ గురువారం తెల్లవారుజామున విడుదలైంది. టీజర్ లాంచ్ కోసం ఓపికగా ఎదురుచూసిన అభిమానులు సినీ ప్రేమికులు భారీ స్థాయిలో రూపొందించిన డార్క్ యాక్షన్ ప్యాక్డ్ యూనివర్శ్ మొద‌టి భాగం టీజ‌ర్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు.

ప్రభాస్ సూపర్ స్టార్ డమ్ కు ఇది నిద‌ర్శ‌నం. స‌లార్ టీజర్ ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించబడిన భారతీయ సినిమా టీజర్ గా అవతరించింది. స‌లార్ టీజ‌ర్ ఆల్ టైమ్ రికార్డ్ ను సృష్టించింది. విడుదలైన కేవలం 17 గంటల్లోనే స‌లార్ టీజర్ 7 కోట్ల మంది (70 మిలియన్లకు పైగా) వీక్ష‌ణ‌ల‌తో యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించింది. 24 గంటల్లోనే 70M ప్లస్ వీక్షణలను సంపాదించిన ఏకైక భారతీయ సినిమా టీజర్ గా నిలిచింది.

ప్రభాస్ ఇప్పుడు ఆల్-టైమ్‌లో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 5 టీజర్ లలో మూడింటితో రికార్డును కలిగి ఉన్నాడు. స‌లార్ (70 మిలియ‌న్లు) త‌ర్వాత‌ ఆదిపురుష్ (68.9M) .. రాధే శ్యామ్ (42.6M) మిగిలిన రెండు టీజర్ లు. సెప్టెంబర్ 28న విడుదలైన స‌లార్ విడుద‌ల కానుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చాలా రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇక స‌లార్ టీజ‌ర్ వీక్షించాక కేజీఎఫ్ ఫ్రాంఛైజీలో వ‌స్తున్న సినిమానా? అంటూ ర‌క‌ర‌కాల సందేహాల‌ను అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. స‌లార్ టీజ‌ర్ పై మిశ్ర‌మ స్పంద‌న‌ల ప్ర‌భావం ఏమాత్రం లేద‌ని డిజిట‌ల్ వీక్ష‌ణ‌లో రికార్డులు ప్రూవ్ చేస్తున్నాయి. ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ సినిమా ప్ర‌భావం ప్ర‌భాస్ స‌లార్ పై లేద‌ని కూడా నిరూప‌ణ అవుతోంది.

Similar News