రంగస్థలంకి బంద్ ఇబ్బంది ఉండదా!?

Update: 2018-02-27 23:30 GMT
మార్చ్ 1 నుంచి దక్షిణాదిలో సినిమా థియేటర్ల బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో.. పరిశ్రమ మూతపడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఇది సమ్మర్ లో రాబోయే పెద్ద సినిమాల మీద ఎఫెక్ట్ చూపనుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమ్మర్ కి షెడ్యూల్ అయిన సినిమాల్లో మొదటిది అయిన రంగస్థలంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండచ్చని అంటున్నారు.

అయితే..ప్రస్తుతం ఇంకా బంద్ ప్రారంభం కాలేదు కాబట్టి.. ఎవరికి ఎంత ప్రభావం.. ఎంత నష్టం అనే అంచనాలు వేయడం కష్టంగా ఉంది. నిజానికి పరీక్షల సీజన్ స్టార్ట్ అయినపుడే ఈ బంద్ కూడా మొదలుకానుండడంతో.. మొదటగా థియేటర్ల మూసివేత ప్రభావం జనాలకు అంతగా కనిపించకపోవచ్చు. కానీ ఇది కంటిన్యూ అయితే మాత్రం అప్పుడు లోటు తెలుస్తుంది. ఈ సమస్య ఓ రెండు వారాలో.. మూడు వారాలో కొనసాగినా.. రంగస్థలం రిలీజ్ షెడ్యూల్ చేసిన మార్చ్ 30 వరకూ మాత్రం ఉండకపోవచ్చని అంటున్నారు.

అలాంటి సమయంలో కనీసం రెండు వారాల పాటు థియేటర్లు మూతపడ్డాక.. థియేటర్లలోకి వచ్చే సినిమాలకు.. ఈ బంద్ అడ్వాంటేజ్ కానుంది. వీటిలో అత్యధికంగా లాభపడేది రంగస్థలమే అనే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి సిట్యుయేషన్ నుంచి అయినా.. ఎంతో కొంత లాభం వెతుక్కోవడం అంటే ఇదే మరి. అంతా మన మంచికే అనే మాట ఊరికే వచ్చిందా చెప్పండి.


Tags:    

Similar News