ఇలయదళపతి విజయ్ కోలీవుడ్ లో యూనిక్ హీరోగా ఇంతింతై అన్న చందంగా ఎదిగిన తీరు ఆల్వేస్ హాట్ టాపిక్. తమిళనాట పవర్ స్టార్ గా ఎదిగిన హీరో. పవన్ కి పవర్ ప్యాక్డ్ ఫ్యాన్స్ ఎలానో అలాగే.. విజయ్ కి తమిళనాడు వ్యాప్తంగా వందలాది అభిమాన సంఘాలున్నాయి. అతని సినిమా ఈవెంట్లు అంటే కచ్చితంగా భారీ ఎత్తున నలుమూలల నుంచి ఫ్యాన్స్ తరలి వస్తారు. అంతకు ముందు అభిమానులు వేదిక వద్ద చేసే హడావుడి.. వ్యక్తిగత డెకెరేషన్ల సందడి గురించి చెప్పాల్సిన పనిలేదు. వేలాది మంది అభిమానుల సమక్షం లో విజయ్ ఈవెంట్లు తరుచూ జరగడం ఓ అనవాయితీగా వస్తోంది. అభిమానుల పట్ల విజయ్ సైతం అంతే ప్రేమను చూపిస్తాడు. అభిమానుల పెళ్లిళ్లకు తమిళ సంప్రదాయం ప్రకారం తెల్ల లుంగీ ధరించి వెళ్లి వధువరూలను ఆశీర్వదిస్తుంటాడు.
మరి ఇప్పుడా అభిమానం ఏమైందో.. ఏమో తెలియదు గానీ తాజా ఈవెంట్ కి అభిమానుల్ని ఆహ్వానించడం లేదు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈనెల 15 న గ్రాండ్ ఆడియో లాంచ్ జరగనుంది. అయితే ఈవెంట్ కు విజయ్ సహా శాటిలైట్ రైట్స్ తీసుకున్న సన్ నెట్ వర్క్ అభిమానులకు ప్రవేశం లేదని చెప్పేయడం షాక్ కి గురి చేసింది.
ఊహించని ఈ నిర్ణయంతో అభిమానులు ఖంగుతిన్నారు. మరీ ఈ నిర్ణయం విజయ్ సహా సన్ నెట్ వర్క్ ఎందుకు తీసుకుంది? అంటే ఆసక్తికర సంగతులే తెలిసాయి. ఇటీవలే ఇండియన్ -2 సెట్స్ లో జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలిసిందే. క్రేన్ ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించగా.. పదుల సంఖ్యలో గాయ పడ్డారు. దీంతో కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇండియన్ -2 చిత్ర దర్శక నిర్మాత.. హీరోలపై కేసులు నమోదై నానా రచ్చ జరుగుతోంది. ఆ భయంతోనే సన్ నెట్ వర్క్ విజయ్ అభిమానులకు నో ఎంట్రీ!! అంటూ ముందుగానే బోర్డు పెట్టేసిందని అంటున్నారు. మరోవైపు కరోనా భయం కూడా అదే రేంజులో ఉంది కాబట్టి జనాల్ని ఆహ్వానించడం లేదని భావిస్తున్నారు.