హౌస్ ఫుల్స్ పడటం లేదురా రమణా!

Update: 2020-01-21 05:58 GMT
సంక్రాంతి పండగ శెలవుల హడావుడి ముగిసింది. స్కూళ్లు.. కాలేజిలు..ఆఫీసులు.. రొటీన్ మొదలైంది. దీంతో సంక్రాంతి హాలిడేస్ ఎడ్వాంటేజ్ ని ఫుల్ గా వాడుకున్న సినిమాల కలెక్షన్స్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆ ఎఫెక్ట్ ప్రధానంగా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' పై కనిపిస్తోంది.

ఈ సోమవారానికి ముందే 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది కానీ సోమవారానికి పరిస్థితి మరింతగా దిగజారిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. చాలా థియేటర్లలో ఆక్యుపెన్సీ సగం కూడా లేదని అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ మహేష్ స్టార్ డమ్.. ఫెస్టివల్ సీజన్ ఎడ్వాంటేజ్ కలిసిరావడంతో భారీ వసూళ్లను నమోదు చేసింది. పైకి నాన్ బాహుబలి రికార్డులు అంటూ ప్రచారం సాగుతూ ఉన్నప్పటికీ రియాలిటి మాత్రం వేరుగా ఉంది. ఈ సినిమా దాదాపు 80% పైగా పెట్టుబడిని రికవర్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఫుల్ రన్ లో కొన్ని ఏరియాలో బ్రేకీవెన్ అయ్యే అవకాశం ఉందని కొన్ని ఏరియాల్లో మాత్రం బయ్యర్లకు కొద్దిపాటి నష్టాలు రావచ్చని అంటున్నారు. అయితే అమెరికాలో మాత్రం సినిమా లాస్ వెంచర్ అనుకోవాలి. యూఎస్ టాప్ 10 లిస్టులో కూడా ఈ సినిమా స్థానం సంపాదించలేకపోయిన సంగతి తెలిసిందే.

మాస్ ఎంటర్టైనర్ కాబట్టి 'సరిలేరు నీకెవ్వరు'తో మహేష్ బాబు ఒక భారీ బ్లాక్ బస్టర్ సాధించాలనుకున్నారు. సంక్రాంతి సీజన్ కలిసి వచ్చింది కానీ సినిమాలో కంటెంట్ అంచనాలను అందుకోలేక  పోవడంతో ఆశించిన విజయ దక్కలేదు.. మహేష్ ఆశించిన భారీ బ్లాక్ బస్టర్ రావాలంటే నెక్స్ట్ సినిమావరకూ వేచి చూడకతప్పదు. మరి వంశీ పైడిపల్లి ఏం చేస్తాడో వేచి చూడాలి.
Tags:    

Similar News