అంత పెరగలేనంటున్న భూమి!!

Update: 2017-09-06 08:39 GMT
భూమి పెడ్నేకర్ ఈ మధ్య తెగ వార్తల్లో నానుతోంది. భూమి బరువు గురించిన వార్తలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. దమ్ లగా కే హైసా అనే మూవీతో కెరీర్ ప్రారంభించిన భూమి.. ఆ తర్వాత మన్ మార్ జియా మూవీలో నటించింది. అయితే.. ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. రీసెంట్ గా టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రంతో మచి సక్సెస్ ను అందుకున్న భూమి పెడ్నేకర్.. ఆ వెంటనే శుభ్ మంగళ్ సావధాన్ చిత్రంతో ఫ్లాప్ ను మూట కట్టుకోవాల్సి వచ్చింది.

ఆయుష్మాన్ ఖురానాతో మూడో సారి జత కట్టడంపై ముందు నుంచే అంతగా పాజిటివ్ రెస్పాన్స్ లేదు. చివరకు రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. అయితే.. ఈ మధ్య కాలంలో భూమి తెగ బరువు తగ్గిపోతోంది. మొదటితో పోల్చితే ఇప్పుడు బాగా సన్నబడిపోయింది వెయిట్ తగ్గించేసుకుంది. ఇది కూడా ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ చూపుతోందనే టాక్ ఉంది. అయితే.. తన బరువుపై ఈమె స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయింది. "ఓ మహిళ బరువు గురించి బాగానే చర్చ జరుగుతుంది. యితే.. నేను చాలానే నేను చాలానే పాజిటివ్ రెస్పాన్స్ ను విన్నాను. ఇక నేను బరువు తగ్గడం ఆపేద్దామని అనుకుంటున్నాను" అని చెప్పింది భూమి పెడ్నేకర్.

"ఇంత బరువు తగ్గడానికి మూడేళ్ల సమయం పట్టింది. అబ్బాయిలు-అమ్మాయిల శరీర తత్వంలో చాలా తేడాలుంటాయి. బరువు తగ్గడాన్ని అబ్బాయిలు సులభంగానే భావిస్తారు. కానీ నాకు మాత్రం ఇది చాలా కష్టంగానే అనిపించింది. యాక్టర్స్ ఎవరైనా సరే కేరక్టర్ కు తగినట్లుగా కనిపించాలి. కానీ నేను ఇప్పుడు 27 కిలోల బరువు పెరగడానికి ఏ మాత్రం సిద్ధంగా లేను" అని చెప్పింది భూమి.
Tags:    

Similar News